NTV Telugu Site icon

Modi-Tamilisai Wishes: సీఎం కేసీఆర్‌ 69వ జన్మదినం.. ప్రధాని, గవర్నర్‌ సహా ప్రముఖుల విషస్‌

Modi Tamilisai

Modi Tamilisai

Modi -Tamilisai Wishes: నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం. ఈరోజు ఆయన 69వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రజాప్రతినిధులు, నేతలు, ప్రముఖులు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. పలు చోట్లు సీఎం పుట్టిన రోజు సందర్భంగా పలుసేవా కార్యక్రమాలు చేపట్టారు. కేసీఆర్‌ పుట్టినరోజు సందర్బంగా.. రాష్ట్రమంత్రా గులాబీ మయంగా మారింది. నగరంలో ఎక్కడ చూసిన కేసీఆర్‌ పుట్టిన రోజు తెలుపుతూ.. పార్టీ శ్రేణులు కట్ అవుట్‌ లు ఏర్పాటు చేసి వారి అబిమానాన్ని చాటుకుంటున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా.. ప్రధాని మోడీ, గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేఆర్‌కు చిరకాలం ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను అని ప్రధాని మోడీ ట్వీట్‌ చేశారు. ఇక గౌరవనీయులైన తెలంగాన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు అని తమిళిసై ట్విట్ చేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో జీవితం అర్థవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

గౌరవనీయులైన తెలంగాణ సీఎం కె. చంద్రశేఖర్‌కు జన్మదిన శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు. జనసేన అధినేత, సినీనటుడు పవన్ కళ్యాణ్ కూడా కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ రాష్ట్ర సమితి అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు. ప్రజాజీవితంలో తనదైన బాట పట్టిన కేసీఆర్‌కు భగవంతుడు ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

తమిళనాడు సీఎం స్టాలిన్ .. తెలంగాణ సీఎం కేసీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంకలు తెలిపారు.

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేజ్రీవాల్‌ ట్విట్టర్‌లో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు.