టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టీఆర్‌ఎస్ పై విమర్శల వర్షం కురిపించారు. రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో అభిలాష్ రావు చేరారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ కేసీఆర్‌పై విమర్శల బాణాలను ఎక్కుపెట్టారు. కొల్లాపూర్‌ను దున్నండి.. కాంగ్రెస్ విత్తనాలు నాటుదాం ఎవ్వరు ఆపుతారో చూస్తామంటూ వ్యాఖ్యానించారు. ఒక్క కొల్లాపూరే కాదు.. వనపర్తి కోట మీద కూడా ఎగిరేది కాంగ్రెస్ జెండానే అన్నారు. కొల్లాపూర్‌లో కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడి పని చేసి గెలిపిస్తే ఆ సన్నాసి పార్టీ వదిలిపోయిండన్నారు. ఎవరిమీద అయితే గెలిచాడో అక్కడికి పోయాడు. ఎక్కడికి నీళ్ళు కావాలన్న… కొల్లాపూర్ వాళ్ళ భూములు అయితే కావాలి కానీ.. వాళ్లకు నీళ్ళు రావు .. జీఓ 91 వచ్చి ముప్పై ఏండ్లు వచ్చినా… ఇప్పటికీ అమలుకు నోచుకోలేదని రేవంత్ రెడ్డి అన్నారు.
2009 లో కేసీఆర్‌ను నీ పాలమూరు బిడ్డలే పార్లమెంట్‌కు పంపి ప్రాణం పోశారు. అయినా పాలమూరు బిడ్డలకు కేసీఆర్ ద్రోహం చేశారని విమర్శించారు. రెండు ఎంపీ, 13 ఎమ్మెల్యేలను గెలిపించినా మా కల్వకుర్తి ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. సమైక్య వాదుల కంటే ఎక్కువ మోసం చేసినది trs పార్టీ అని రేవంత్ అన్నారు. పాలమూరును మోసం చేసింది టీఆర్ఎస్ దొంగల పార్టీ అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఎక్కువ నష్టపోయింది. కష్టపడుతున్నది పాలమూరు బిడ్డలేనన్నారు. నేను మీ బిడ్డని.. నేను ఎంత ఎత్తుకు ఎదిగినా..నేను పాలమూరు బిడ్డను అని గర్వంగా చెప్పుకుంటా అన్నారు. వచ్చే ఎన్నికల్లో పాలమూరు గడ్డ మీద కాంగ్రెస్ జెండాను ఎగురవేయాలన్నారు.
పాలమూరు జిల్లా నీ దత్తత తీసుకుంటా ..దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన జిల్లా గా తీర్చి దిద్దుతా అని రేవంత్ అన్నారు. ఇప్పటి వరకు ఎవ్వరూ గెలిచినా ఏం చేయలేదన్నారు. ఇంట గెలిచి రచ్చగెలవాలంటారు.. మీ బిడ్డగా నా జిల్లా అంతా కాంగ్రెస్‌ను గెలిపిద్దామన్నారు ఎవరు సీఎం అయినా..pm అయినా… జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత నాది. నిరంజన్ రెడ్డి.. నోట్ల రెడ్డి అయ్యాడు ఎవడు ఏం చేసినా… నిరంజన్‌కి ముట్ట చెప్పలాట ఆఖరికి పుష్కరాల్లో మొలతాడు అమ్ముకునేటోడి నుంచి కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు అని ఆరోపించారు.
కొల్లాపూర్, వనపర్తి నాయకులు శివలింగం మీద తేలు లెక్క తయారైంది .ఒడుపుగా తేలును కిందకీ చెప్పుతో కొట్టాలన్నారు. కేసీఆర్ sv రంగా రావు కంటే ఎక్కువ డైలాగులు వేశాడు. వరి రైతులు రోడ్ల మీద పడుకుంటున్నారు. ప్రధాని నీ కలుస్త అన్నాడు.. కలవ కుండా వచ్చాడు మోడీ..కెసీఆర్ వీధి బాగోతాలు అడి రైతులను మోసం చేస్తున్నారు. కేసీఆర్ పాలనలో 67,699 మంది రైతులు చనిపోయారు అని నిరంజన్ రెడ్డి నిజం చెప్పాడు. రైతులు ఇక్కడ చనిపోతే సాయం చేయలేదు. వరి ధాన్యం కొనుగోలు కోసం నే 27,28న నేనే దీక్షకు కూర్చుంటున్నా అని రేవంత్ ప్రకటించారు. వరి కొనక పోతే… బీజేపీ trs నీ ఉరికి తాళ్లు బిగించుడే అన్నారు. తిక్కలోడు తిరునాళ్ళ కు పోతే… ఎక్కుడు..దిగుడుకే సరిపోయిందట కేసీఆర్ పరిస్థితి కూడా అలాగే ఉందని రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు.
