Site icon NTV Telugu

Piyush Goyal: తెలంగాణ అంటే వివక్షలేదు

తెలంగాణలో ధాన్యం సేకరణకు సంబంధించి కేంద్రంపై టీఆర్ఎస్ పోరాటానికి దిగిన సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో తెలంగాణ మంత్రుల సమావేశం ముగిసింది. అరగంటపాటు సాగింది ఈ సమావేశం. పంజాబ్ నుంచి ఏ తరహాలో అయితే బియ్యాన్ని కేంద్రం సేకరిస్తుందో, తెలంగాణ నుంచి కూడా అదే తరహాలో బియ్యాన్ని సేకరిస్తుంది. ఏ రాష్ట్రం పట్ల కేంద్రం ఎలాంటి వివక్షతతో వ్యవహరించదన్నారు కేంద్ర ఆహారశాఖ మంత్రి పీయూష్ గోయల్. తెలంగాణ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం. ఫిబ్రవరి22, మార్చి 8 తేదీల్లో సమావేశాలకు రావాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరాం. అయినా సమావేశానికి రాలేదు.

ఎంత మేరకు బియ్యాన్ని కేంద్రానికి ఇవ్వగలుగుతారో, తెలంగాణ వివరాలు ఇవ్వలేదన్నారు. రైతులకు భ్రమలు కలిపిస్తూ, కేంద్రంపై తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ప్రచారం చేస్తోంది. అన్ని రాష్ట్రాలతో చేసుకున్న ఒప్పందం మేరకు, కేంద్రం కేవలం బియ్యాన్ని మాత్రమే సేకరిస్తుంది. పంజాబ్‌ నుంచి కూడా బియ్యాన్నే సేకరిస్తుంది. నేరుగా ధాన్యాన్ని కేంద్రం సేకరించదన్నారు మంత్రి పీయూష్ గోయల్.

https://ntvtelugu.com/errabelli-dayakarrao-fires-on-bjp/
Exit mobile version