Site icon NTV Telugu

ఇలాంటి మాటలు మాట్లాడితే చెప్పుదెబ్బలు తప్పవు…

వైఎస్ఆర్ ని దొంగ అంటూ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం అని షర్మిల పార్టీ అధికార ప్రతినిధి పిట్టా రాంరెడ్డి అన్నారు. అలాంటి వ్యాఖ్యలు చేసినందుకు మంత్రులకు సిగ్గుపడాలి. 2004లో వైఎస్ఆర్ తో పెట్టుకునేటప్పుడు సోయి లేదా అని అడిగారు. వైఎస్ఆర్ కాదు మీరే గజదొంగలు. ఎంతోమంది పేదలకు సంక్షేమపథకాలు అందించిన ఘనత వైఎస్ఆర్ కే దక్కుతుంది. మంత్రులు ఆత్మపరిశీలన చేసుకోవాలి. మరోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే చెప్పుదెబ్బలు తప్పవు. షర్మిల పార్టీకి వస్తున్న ఆదరణ తట్టుకోలేకే వైఎస్ఆర్ పై బురద జల్లుతున్నారు అని తెలిపారు. ప్రశాంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. ఎన్ని డ్రామాలు ఆడిన జులై 8న పార్టీ ప్రకటన ఉంటుంది. ప్రజల్లో వైఎస్ఆర్ పై ఉన్న అభిమానాన్ని చంపలేరు అని పేర్కొన్నారు.

Exit mobile version