Rohith Reddy: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఈడీ ముందు హాజరుకానున్నారు. రోహిత్ రెడ్డి చేసిన అభ్యర్థనను ఈడీ తిరస్కరించింది. ఇవాళ ఉదయం రోహిత్ రెడ్డి తరపున ఆయన పీఏ శ్రవణ్ ఈడీ కార్యాలయానికి వెళ్లారు. రోహిత్‌రెడ్డికి మరికొంత సమయం కావాలని కోరారు. చాలా తక్కువ సమయం ఇచ్చారని, సెలవుల కారణంగా బ్యాంక్ స్టేట్‌మెంట్స్ తీసుకు వచ్చేందుకు ఇబ్బందిగా ఉందని తెలిపారు. ఈడీ చెప్పిన ప్రకారం డాక్యుమెంట్లు కొన్ని మాత్రమే ఉన్నాయని ఇతర డాక్యుమెంట్లు తీసుకోలేకపోయామంటూ రోహిత్‌రెడ్డి పీఏ శ్రవణ్ తెలిపారు. అయితే ఈఅభ్యర్థనను ఈడీ తిరస్కరించింది. దీంతో ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు వ్యక్తిగత బ్యాంకు ఖాతాలో తోటి విచారణకు పైలెట్ రోహిత్ హాజరుకానున్నారు. మిగిలిన సమాచారం సమర్పించేందుకు మరింత సమయం కావాలని ఆయనే స్వయంగా అధికారులను కోరే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Read also: Vellampalli Srinivas: పవన్ కల్యాణ్ పవర్ లేని స్టార్.. ఆయన రద్దైన నోట్లతో సమానం..!
తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఈడీ విచారణకు హాజరుకాలేదు. ఇవాళ ఉదయం 10 గంటల 30 నిమిషాలకు పైలెట్ రోహిత్ రెడ్డి ఈడీ కార్యాలయంకు వ్యక్తిగత బ్యాంకు ఖాతాల వివరాలతో హాజరు కావల్సి ఉంది. అయితే ఈడీ ఆఫీసుకు రోహిత్‌రెడ్డి పీఏ శ్రవణ్ వెళ్లిన విషయం తెలిసిందే.. మ్మెల్యేలకు ప్రలోభాల కేసులో రోహిత్ రెడ్డి ప్రధాన ఫిర్యాదుదారుగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక, రోహిత్ రెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇటీవల నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే. ఆర్థిక పత్రాలు, ఆదాయపు పన్ను రిటర్న్‌లను డిసెంబర్ 19లోగా సమర్పించాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది. 2015 ఏప్రిల్ నుండి కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు అందించాలని ఈడీ కోరింది. ఆధార్ కార్డు నుండి పాస్ పోర్టు వరకు 10 అంశాల బయోడేటా వివరాలతో విచారణకు రావాలని ఆదేశించింది ఈడీ. పైలెట్ రోహిత్ రెడ్డి విద్యార్హతలు, కేసుల వివరాలను ఈడి ఇచ్చిన ఫార్మాట్లో సమర్పించాలని ఆదేశం జారీచేసింది. ఎన్నికల అఫిడవిట్ లో విద్యార్హతలపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. విద్యార్హతలు పత్రాలతో విచారణకు హాజరు కావాలంటూ ఈడీ నోటీసులో పేర్కొంది. విచారానికి వచ్చే సమయంలో పాస్పోర్ట్ తో సహా విచారణ హాజరు కావాలని ఈడీ కోరింది. విదేశీ పర్యటనలపై ఈడీ ఇచ్చిన ఫార్మెట్లో పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే.
Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
