Site icon NTV Telugu

PFI Training: పీఎఫ్ఐ ట్రైనింగ్ పేరుతో ఉగ్రకార్యకలాపాలు.. రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు

Pfi Terror Training

Pfi Terror Training

PFI Training: నిజామాబాద్‌లో ఉగ్రవాదుల లింకులు కలకలం రేపుతున్నాయి. నిషేధిత సిమీ అనుబంధ సంస్థ ‘పీఎఫ్‌ఐ’ కరాటే ట్రైనింగ్ పేరుతో ఉగ్రకార్యకలాపాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ట్రైనింగ్ పేరిట పీఎఫ్ఐ మ‌త ఘ‌ర్షణల కుట్రకు తెరలేపిందని పోలీసులు నిర్ధారించారు. 28 మంది నిందితులను గుర్తించి నిజామాబాద్‌ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పీఎఫ్‌ఐ ఆర్గనైజేషన్‌ పేరుతో మరో 8 సంస్థలు నడుపుతున్నట్లు గుర్తించారు. గతంలో నిజామాబాద్‌లోని ఆటోనగర్‌లో ట్రైనింగ్ కేంద్రం దాడి చేసి పలువురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసింది. అప్పుడు పీఎఫ్‌ఐ ట్రైనర్‌తో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం రిమాండ్ రిపోర్టు ద్వారా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

పీఎఫ్‌ఐ ఆర్గనైజేషన్ నడుపుతున్న 8 సంస్థల్లో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా, క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, నేషనల్ విమెన్ ఫ్రంట్ ఉన్నట్లు గుర్తించారు. పీఎఫ్‌ఐ ప్రధాన ఉదేశం ఆక్టివ్ ముస్లిమ్స్‌కి శిక్షణ ఇవ్వడంతో పాటు ఇతర మతాలపైన అనుచిత వ్యాఖ్యలు చేయడమని రిమాండ్ రిపోర్టు ద్వారా తెలిసింది. ఇస్లామిక్ రాజ్య స్థాపన కోసం స్టోన్ ఫెల్టింగ్, కత్తులతో శిక్షణ ఇస్తూ యువకులను పీఎఫ్ఐ రెచ్చగొడుతోంది. సోషల్ వర్క్ పేరుతో ఫండ్స్ వసూలు చేసి క్యాడర్‌ను పెంచుతోంది. డివిజన్, రీజినల్, స్టేట్ క్యాడర్‌తో రెగులర్ మీటింగ్ పెడుతోంది. స్కూల్, కాలేజ్, మదర్సా, మస్జీద్, మోహల్లాస్‌లో గ్రౌండ్ లెవెల్‌లో యువకులను రిక్రూట్ చేయాలని పీఎఫ్ఐ పథకం వేసింది.

CI Nageshwar Rao Case: వివాహితపై తుపాకీ గురిపెట్టి అత్యాచారం.. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసిన పోలీసులు

మత ఘర్షణలు జరిగిన సమయంలో ఎలా వ్యవహరించాలి, భౌతిక దాడులు ఎలా చేయాలనే దానిపై శిక్షణనిస్తున్నారని పోలీసుల విచారణలో తేలింది. జిల్లాలో పీఎఫ్ఐ ఎక్కడెక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తుందనే దానిపై ఆరా తీస్తున్నారు. యువత ఆసక్తి చూపవద్దని, సంయమనం పాటించాలని సూచించారు. గత సంవత్సరం బోధన్‌లో ఒకే అడ్రస్ పై బంగ్లాదేశీయులకు 72 పాస్ పోర్టులు జారీ అయిన సంగతి తెలిసిందే. గతంలో బోధన్ లో ఉగ్ర కదలికలు వెలుగు చూశాయి. సౌదీలో ఉన్న సమయంలో ఆ వ్యక్తి కదలికలపై నిఘా పెట్టారు. ఉగ్రవాదులతో లింకులున్నాయని అతడిని అదుపులోకి తీసుకున్నారు.

Exit mobile version