ఓవైపు కలలో కూడా వాహనదారులను పెట్రోల్, డీజిల్ ధరలు ఆందోళనకు గురిచేస్తుంటే.. మరోవైపు పెట్రోల్ బంకులు కూడా మోసాలకు పాల్పడుతూ.. సామాన్యుడి జేబుకు చిల్లుపెడుతున్నాయి. పెట్రోల్ బంకుల్లో మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే సుంకాలతో వాహనాలను రోడ్డుపైకి తీసుకువద్దామంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి దాపురించింది. అయితే ఆఫీసుకు వెళ్లాలన్నా, నిత్యావసరాలకు బైకో, కారో బయటకు తీస్తే.. బంకుల్లో జరిగే మోసాలకు జేబుల్లో ఉన్న డబ్బంతా ఖాళీ అవుతోంది. ఇలాంటి ఘటనే హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ రోడ్‌లో చోటు చేసుకుంది. భర్మ ఆటో సంస్థకు చెందిన భారత్ పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ కొట్టించుకునేందుకు కవిత అనే మహిళ వచ్చింది. ఆమె రూ.200ల పెట్రోల్‌ను ఆమె స్కూటర్‌లో పోయించింది.
పెట్రోల్ పోయించుకున్న తరువాత తక్కువ పెట్రోల్ వచ్చినట్లు గ్రహించి, అక్కడే ఉన్న వాహనదారులతో కలిసి ఆమె స్కూటర్‌లోని పెట్రోల్‌ను ఓ ఖాళీ బాటిల్‌లోకి తీశారు. తీరా చూస్తే.. రూ. 200ల పెట్రోల్ కొట్టిస్తే కనీసం లీటర్ పెట్రోల్ కూడా రాకపోవడంతో ఆమెతో పాటు అక్కడున్న వారు అవాక్కయ్యారు. ఈ విషయమై బంక్ సిబ్బందిని నిలదీస్తే బంక్ యాజమాన్య ప్రతినిధులు ఎదురుదాడి చేసే ప్రయ్నతం చేశారు. ఈ నేపథ్యంలో విషయం తెలుసుకున్న పోలీసులు మెట్రాలజీ అధికారులు బంక్ వద్దకు చేరుకొని పెట్రోల్, డీజిల్ ఫిల్లింగ్ మిషన్లను పరిశీలించారు. అంతేకాకుండా బంక్‌లో ఉన్న ఓ రెండు ఫిల్లింగ్ మిషన్లలో సాంకేతిక లోపాలు ఉన్నట్లు గుర్తించామని, వాటికి నోటీసులు కూడా ఇచ్చినట్లు మెట్రాలజీ అధికారులు సంజయ్‌కృష్ణ, శివానంద్‌లు తెలిపారు.
https://ntvtelugu.com/komatireddy-venkat-reddy-visit-yadadri-temple/
