Site icon NTV Telugu

Petrol Price: వాహనదారులకు కాస్త ఊరట.. స్థిరంగా పెట్రోల్‌!

Petroll Desel

Petroll Desel

పెరుగుతోన్న ఇంధ‌న ధ‌ర‌లు సామాన్యుల‌కు చుక్కలు చూపిస్తున్నాయి. వాహనదారులు బండి బయటకు తీయలేని పరిస్థితి నెలకొంది. ఇంధ‌న ధ‌ర‌లు క్ర‌మంగా ఎగ‌బాకుతూ వచ్చి క్ర‌మాంగా లీట‌రుకు రూ.120 దాటాయి. ఇటీవ‌ల కేంద్ర ప్ర‌భుత్వం ఎక్సైజ్ సుంకం మరోసారి తగ్గించింది. దీంతో భారీ ఎత్తున ధరల్లో మార్పు కనిపించింది. పెట్రోల్ ధరలో రూ.9 కి పైగా, డీజిల్ ధరలో రూ.7 రూపాయలకు పైగా తగ్గింది. దీంతో కాస్తయినా ఉపశమనం కలిగిందని సామాన్యులు భావిస్తున్నారు.

హైదరాబాద్‌లో పెట్రోల్ డీజిల్ ధరలు ఐదు రోజులుగా స్థిరంగా ఉన్నాయి. నేడు పెట్రోల్ ధర రూ.109.66గా ఉంది. ఇక డీజిల్ ధర లీటరుకు రూ.97.82 గా ఉంది. ఇక వరంగల్‌లో (Warangal Petrol Price) ధరలు నేడు తగ్గాయి. నేడు (మే 29) పెట్రోల్ ధర రూ.0.19 పైసలు పెరిగి రూ.109.35 గా ఉంది. డీజిల్ ధర రూ.0.17 పైసలు పెరిగి రూ.97.52గా ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.

నిజామాబాద్‌లో పెట్రోల్ ధర నేడు స్థిరంగా ఉంది. పెట్రోల్ ధర రూ.111.49 గా ఉంది. డీజిల్ ధర రూ.99.52 గా ఉంది. గత కొన్ని రోజులుగా నిజామాబాద్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో మార్పులు బాగా ఉంటున్నాయి.

ధరల పెరుగుదలకు కారణం

గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి.

ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. అప్పుడు బ్యారెల్ ముడి చమురు ధర 32.30 డాలర్ల వద్దే ఉండేది. ప్రస్తుతం 100 డాలర్లకు అటు ఇటుగా ఉండగా.. మే 29 నాటి ధరల ప్రకారం ముడి చమురు బ్యారెల్ ధర 113.14 డాలర్ల స్థాయిని చేరింది.

Cotton Price: బంగారంలా మెరిసిపోతున్న పత్తి

Exit mobile version