Harish Rao: కన్న కొడుకు చీర కొనివ్వకపోయినా.. పెద్ద కొడుకు కేసీఆర్ బతుకమ్మ చీర ఇస్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెదక్ జిల్లా మనోహరాబాద్ లో నూతన ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. కాంగ్రెస్ హయాంలో ఉచిత కరెంట్ కాదు.. ఉత్త కరెంట్ అని ఎద్దేవ చేశారు. ఉచితాలు వద్దు అనే బీజేపీకి బుద్ది చెప్పాలని అన్నారు. కేసీఆర్ ది గజ్వేల్ నియోజక వర్గం కావడం మీ అదృష్టం అని పేర్కొన్నారు. పేదల సంక్షేమం కోసం పని చేస్తున్న ప్రభుత్వం మాది అని హర్షం వ్యక్తం చేశారు.
ఢిల్లీలో కూర్చున్న వారు కాళేశ్వరం మీద విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు పింఛన్ రూ.75 ఉండే. ఎవరైనా చనిపోతేనే తప్ప వారి స్థానంలో నాడు కొత్తవి ఇచ్చేవి కావని గుర్తు చేశారు హరీష్ రావ్. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 200 చేసిందని, కానీ ఒంటరి మహిళలకు, చేనేత, గౌడ పింఛన్లు ఇవ్వలేదని అన్నారు. కానీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం మాత్రం ఏకంగా 10 ఇంతలు పెంచి, రూ. 2016 చేసామన్నారు.
Also Read
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Cheyutha Pension : చేయూత పింఛన్‌కు రేపే డెడ్‌లైన్.. మిస్ అయితే కష్టమే.!
- Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
- Harish Rao : రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా.?రేవంత్‌కు హరీశ్ రావు లేఖ..!
పింఛన్ల డబ్బు పెరిగింది పింఛన్ల సంఖ్య పెరిగిందని తెలిపారు. ఇది టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో జరిగిన మార్పని ఆనందంగా వ్యాఖ్యానించారు. అర్హులైన ప్రతి పేదవాడికి పంచన్ ఇస్తామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హరీష్ రావ్ భరోసా ఇచ్చారు. కన్న కొడుకు చీర కొని ఇవ్వకపోయినా పెద్ద కొడుకు సీఎం కేసీఆర్ బతుకమ్మ చీర ఇస్తున్నారని అన్నారు. బిడ్డ పెళ్లికి కళ్యాణ లక్ష్మి ఇస్తున్నారని అన్నారు. మాకు కులం లేదు మతం లేదు.
పేదలందరికీ భరోసా ఇవ్వడమే మా ప్రభుత్వ లక్ష్యం అని పేర్కొన్నారు. తూప్రాన్ గజ్వేల్ మెదక్ లో మంచి ఆసుపత్రులు వచ్చాయని అన్నారు. కరోనా వల్ల కొంత ఇబ్బంది ఉండేదని, అయినా పేదలను కడుపులో పెట్టుకొని చూస్కున్నాడని గుర్తు చేశారు. పది కిలోల బియ్యం ఇచ్చారు, సమయానికి పింఛన్లు ఇచ్చారని అన్నారు. భూమికి బరువయ్యే పంట పండుతుంది. కేసీఆర్ రైతు పక్షపాతి కాబట్టి ఇది సాధ్యం అయ్యిందని మంత్రి హరీష్ రావ్ అన్నారు.
Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు పేరు చెప్తే.. ఒక్క పథకమైనా గుర్తుకువస్తుందా?
తాజావార్తలు
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
-
Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
-
Manisha Koirala: భారత్, చైనా అండగా ఉండాలి.. నేపాల్ వరదలపై కన్నీళ్లు పెట్టుకున్న మనీషా కొయిరాలా..
-
GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్‌కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
-
Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’కు టాలీవుడ్ సినిమాల సెగ.. రిలీజ్ డేట్ మారుతుందా?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!