NTV Telugu Site icon

ఆసిఫ్ నగర్ స్థానికుల్లో భయాందోళనలు…

హైదరాబాద్ హబీబ్‌నగర్, మల్లేపల్లిలోని భారత్‌ గ్రౌండ్ వద్ద స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దర్భంగా పేలుడుకు సంబంధించిన లింకులు ఆసిఫ్ నగర్ లో బయటపడడంతో తమ వద్దే ఉంటూ పేలుళ్ళకు పాల్పడ్డారు అని తెలిసి ఒక్కసారిగా ఖంగు తిన్నారు స్థానికులు. చాలా సార్లు అన్నదమ్ములను చూసామని వాళ్ళు చెప్తున్నారు. తల్లితో కలిసి ఇద్దరు అన్నదమ్ములు గత కొద్ది కాలంగా నివాసం ఉంటున్నారని చెబుతున్నారు స్థానికులు. వారు రెడీమేడ్ దుస్తుల వ్యాపారం చేస్తున్నట్లు చెప్తున్న స్థానికులు… నాసిర్ ఎక్కువగా కనపడే వాడు, ఇమ్రాన్ తక్కువ సార్లు కనపడినట్లు చెబుతున్నారు స్థానికులు. అయితే రెండు రోజుల క్రితం ఈ ఇద్దరు అన్నదమ్ములను ఎన్ఐఏ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.