NTV Telugu Site icon

Bhatti Vikramarka: కారు ఉంటే తప్ప యాదాద్రిని దర్శించుకునే అవకాశం లేకుండా పోయింది

Bhatti Vikramarka

Bhatti Vikramarka

Bhatti Vikramarka: కారు ఉంటే తప్ప యాదాద్రి శ్రీలక్ష్మీనారసింహా స్వామిని దర్శించుకునే అవకాశం లేకుండా పోయిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు.యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట లో భట్టి విక్రమార్క కార్నర్ మీటింగ్ లో మాట్లాడుతూ.. యాదగిరిగుట్ట అత్యంత పవిత్రమైన ప్రదేశమన్నారు. ఎవరికి ఎన్ని కష్టాలు వచ్చినా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనారసింహాస్వామి వద్దకు వచ్చి నిద్రచేసి వెళ్తారని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచాలని, ప్రజలకు సుఖసంతోషాలను అందిచాలని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనారసింహాస్వామి పాదాభివందనం చేసి వేడుకుంటున్నారని తెలిపారు. సీఎం యాదగిరి గిరిగుట్ట దేవుడిని యాదాద్రీ శ్రీ లక్ష్మీనారసింహాస్వామిగా ఖరీదైన దేవుడిగా మార్చినారని తెలిపారు. అహాంకారంతో విర్రవీగేవారినీ ఎలా దండించాలో శ్రీ లక్ష్మీనారసింహాస్వామికి తెలుసని తెలిపారు. అధికార ఆహంకారంతో విర్రవీగే కేసీఆర్ ప్రహాళ్లాదుడి కథను వినాలని ప్రజల తరుపున కొరుతున్నాని ఎద్దేవ చేశారు.

గత ప్రభుత్వాలు ఇచ్చిన భూములను బలవంతంగా లాక్కుంటున్నారు ప్రభుత్వ పెద్దలు అంటూ ఆరోపించారు. అభివృద్ధి అంటే ప్రజల జీవనప్రమానం పెరగాలన్నారు. ఉపాధి అవకాశాలు పెరగాలి.. కనీస సౌకర్యాల సామర్ధ్యం పెరగాలని తెలిపారు. కానీ.. రోడ్ల వెడల్పుపేరుతో, అభివృద్ధితో ప్రజల భూములు లాక్కుంటుంది ప్రభుత్వం అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. కారు ఉంటేనే తప్ప యాదాద్రి శ్రీలక్ష్మీనారసింహా స్వామిని దర్శించుకునే అవకాశం లేకుండా పోయిందని అన్నారు. స్దానిక యువత జీవనోపాది కోసం నడుపుకునే ఆటోలను కొండపైకి అనుమతి ఇవ్వకపోవడం భాదాకరమని తెలిపారు. ఆనిర్ణయం యువకుల ఉపాధి అవకాశాలను కొల్పోయేలా చేయడమే అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఉన్న పద్దతిలో కొండపైనే భక్తులు రాత్రి సమయంలో నిద్రించే సాంప్రదాయాన్ని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పునుద్దరిస్తామని తెలిపారు.

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నిరుద్యోగ సమస్య పరిష్కారానికి రిక్రూట్ మెంట్ వార్షిక క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు. ఉద్యోగం వచ్చేంత వరకు నిరుద్యోగ భృతి అందిస్తామన్నారు. ఉచిత నిర్బంద విద్యను అందిస్తామన్నారు. ప్రభుత్వం ఉద్యోగులకు 15వ తేది వచ్చినా జీతాలు ఇవ్వలేని అసమర్ధ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అంటూ తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ ప్రతీ నెల 1వ తేదినే జీతాలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణ తెచ్చుకున్న ఆకాంక్షలు నెరవేర్చడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా ప్రజలు ఆశీర్వదిస్తే… ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణలో పరిపాలన ఉంటుందని అన్నారు. ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకొకపోతే రాష్ట్రం మరింత అప్పుల ఊబిలో కూరుకుపోతుందన్నారు. ఆలేరు నియోజకవర్గ ప్రజలు గతంలో ఎన్నడూలేని విధంగా కాంగ్రెస్ పార్టీకీ బ్రహ్మరథం పలికారని భట్టి పేర్కొ్న్నారు.
Imran Khan: నాపై మూడోసారి హత్యాయత్నం జరగబోతోంది.

Show comments