Site icon NTV Telugu

నేడు టీఆర్ఎస్‌లో చేరనున్న పెద్దిరెడ్డి

మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి .. నేడు టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. తెలంగాణభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకోనున్నారు. తన అనుచరులు, కార్యకర్తలు, నాయకులతో సీఎం సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు పెద్దిరెడ్డి ఇప్పటికే తెలిపారు.కేసీఆర్‌ సర్కార్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నానన్నారు పెద్దిరెడ్డి.హుజూరాబాద్‌లో ఈటలకు బీజేపీ అధిష్ఠానం అధిక ప్రాధాన్యమివ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఇటీవల పెద్దిరెడ్డి రాజీనామా చేశారు.

read also : భారత్‌ ఘోర పరాజయం.. సిరీస్‌ నెగ్గిన శ్రీలంక..

దళితుల భూములను అక్రమంగా కాజేసిన ఈటలను పార్టీలో చేర్చుకోవద్దని చెప్పినా బీజేపీ అధిష్ఠానం పెడచెవిన పెట్టడం, తన అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ ఆయన ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గంలో 1994, 1999లో … టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు పెద్దిరెడ్డి. 1999 నుంచి 2004 వరకు చంద్రబాబు హయాంలో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. 2019లో బీజేపీలో చేరారు. తర్వాతి పరిణామాలతో రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు.

Exit mobile version