భారత్‌ ఘోర పరాజయం.. సిరీస్‌ నెగ్గిన శ్రీలంక..

శ్రీలంకతో జరుగుతున్న మూడో టీ-20 లో టీమిండియా ఓటమిపాలైంది. 7 వికెట్ల తేడాతో భారత్‌పై, శ్రీలంక విజయం సాధించింది. దీంతో 2-1 తేడాతో లంక టీం సీరీస్ కైవసం చేసుకుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో, 8 వికెట్ల నష్టానికి….81 పరుగులు మాత్రమే చేసింది. స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్‌కు వచ్చిన లంక జట్టు 3 వికెట్లు కోల్పోయి….14.3 ఓవర్లోనే టార్గెట్‌ను ఛేజ్ చేసింది. భారత బ్యాటింగ్‌లో కుల్దీప్ యాదవ్, రుతురాజ్ గైక్వాడ్, భువనేశ్వర్ కుమార్ మాత్రమే రెండు అంకెల స్కోర్ చేశారు. శ్రీలంక బౌలర్లలో హసరంగ నాలుగు వికెట్లతో భారత బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బకొట్టాడు. టీమిండియా బౌలింగ్‌లో రాహుల్ చహర్ ఒక్కడే మూడు వికెట్లు తీసినప్పటికి లాభం లేకుండా పోయింది.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-