NTV Telugu Site icon

Minister Sridhar Babu Counter: ట్విట్టర్‌ లో కేటీఆర్‌ కామెంట్స్‌.. మంత్రి శ్రీధర్‌ బాబు కౌంటర్‌..

Minister Sridhar Babu Counter

Minister Sridhar Babu Counter

Minister Sridhar Babu Counter: మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ లో చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఎవరు తెలివితేటలు చూపిస్తున్నారో ప్రత్యక్షంగా కనబడుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తాను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని వ్యాఖ్యానించారని క్లారిటీ ఇచ్చారు. మీకు సంబంధించిన అంశాల విషయంలో మీరు తలదూర్చినట్టు మేము తలదూర్చం కౌంటర్ ఇచ్చారు. మీ పార్టీ అంతర్గత సమస్యల్ని మీరు పరిష్కరించుకోవాలని సూచించారు. మా పార్టీపై నెపం వేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఎవరు తెలివిగలవారో ప్రజలే చెప్తారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇక్కడ ప్రజలందరూ తెలంగాణ ప్రజలే ,వారందరినీ గౌరవిస్తామన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని అంతర్జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తామన్నారు. రాజకీయాలకు అతీతంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ నీ మరింత పెంచడానికి అందరూ పాలుపంచుకోవాలన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని కొన్ని ప్రతిపక్షాలు దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. ఎవరు ఏం చేసినా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని కాపాడుతామని శ్రీధర్ బాబు అన్నారు.
Khairatabad Ganesh: ఖైరతాబాద్ వినాయకుడి దర్శనానికి లక్షల సంఖ్యలో భక్తులు..

Show comments