Kamanpur Police: కోడి పందేలు జరుగుతున్నాయనే పక్కా సమాచారంతో కమాన్‌పూర్ పోలీసులు దాడు నిర్వహించారు. కోడి పందేలకు పాల్పడిన నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ పందెం కాసిన రెండు కోళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. కానీ కేసును విచారించిన న్యాయమూర్తి.. నిందితులకు జరిమానా విధిస్తూ కోళ్లను వేలం వేయాలని తీర్పు ఇచ్చారు. దీంతో పోలీసులు కోళ్లను వేలం వేస్తున్నట్లు ఎస్సై చంద్రశేఖర్ వెల్లడించారు. పోలీస్టేషన్ లో కోళ్ల వేలం ఏంటి? కోర్టు తీర్పుకు సర్వత్రా ఆశ్చర్యానికి గురయ్యారు.
Read also: Kishan Reddy: అభివృద్ధి అంటే హైటెక్ సిటీ కాదు.. పాత బస్తీని చేయండి..
పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌లో మంథని కోర్టు ఆదేశాలతో పోలీసులు కోళ్లను పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి ప్రత్యేక బోనును ఏర్పాటు చేశారు. ఆహారం, నీరు క్రమం తప్పకుండా అందించారు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కమాన్ పూర్ పోలీస్ స్టేషన్ లో కోళ్ల వేలం నిర్వహించారు. ఈ వేలంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. పోలీస్టేషన్ లో కోళ్ల వేలం వేస్తుండంతో ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అంతే కాదు పోలీస్టేషన్ లో కోళ్ల వేళం అయితే.. పోలీసులే వేళం పాడటం మరింత ఆశక్తిని కలిగించింది. అయితే మొదటి పందె కోడి 2 కిలోల 980 గ్రాములు ఉండగా, కమాన్ పూర్ కు చెందిన పురాణం సారయ్య వేలంలో రూ. 4 వేల రూపాయలకు దక్కించుకున్నాడు. రెండో కోడి 2 కిలోల 410 గ్రాములు ఉండగా కమాన్‌పూర్‌కు చెందిన బోనాల సత్తయ్య రూ. 2 వేల 500 రూపాయలకు కొనుగోలు చేశాడు. పందెం కోడి రుచిగా ఉంటుందని అందుకే కమాన్ పూర్ గ్రామస్తులు వేలంలో దక్కించుకున్నారని అనుకుంటే మీరనుకున్నది పొరపాటే.. వేలంలో దక్కించుకున్న ఇద్దరు కమాన్‌పూర్ గ్రామస్తులు తమకు వేలంలో వచ్చిన కోళ్లను పందెం కోసం.. తమ పొలంలో పెంచుతామని చెబుతున్నారు. ఏదిఏమైనా పోలీస్టేషన్ లో పందెంకోళ్ల వేలం అంటే ఆశక్తిగా తిలకించేందుకు పెద్ద సంఖ్యలో రావడం సర్వత్రా ఆశక్తి నెలకొంది.
R.S.Praveen Kumar: తెలంగాణపై ఢిల్లీ నుండి కుట్ర.. ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు..