Urea : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని మల్లాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పాక్స్) నుంచి రైతులకు అందాల్సిన యూరియాను పక్కదారి పట్టిస్తున్న ఘటన బహిర్గతమైంది. రైతులు చెబుతున్న వివరాల ప్రకారం, సంఘం నుంచి అక్రమంగా యూరియా బస్తాలను వాహనంలో తరలిస్తున్న దృశ్యాలు ప్రత్యక్షమయ్యాయి. ఈ వాహనాన్ని స్థానిక రైతులు అడ్డగించి పట్టుకున్నారు. అయితే, యూరియా తరలింపుకు సంబంధించిన ఎలాంటి పత్రాలు లేకపోవడం, ఓటిపి లేకుండా బస్తాలను తరలించడం రైతుల్లో ఆగ్రహం రేపింది.
The Raja Saab : ది రాజా సాబ్ మ్యూజికల్ జర్నీ మొదలు.. ఫస్ట్ సింగిల్ డేట్ ఔట్”
రైతులు ఉదయం నుంచి సహకార సంఘం వద్ద క్యూల్లో నిలబడి ఎరువుల కోసం ఎదురుచూస్తుండగా, నిర్వాహకులు మాత్రం యూరియా బస్తాలను అక్రమంగా తరలిస్తున్నారని వారు తీవ్రంగా విమర్శించారు. స్థానిక రైతులు పట్టుకున్న వాహనాన్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. “రైతులు ఇబ్బందులు పడుతుంటే, అధికారులు తమ సొంత వ్యక్తులకు ఎరువులు మళ్లించడం మాకు తట్టుకోవడం లేదు” అని ఆవేదన వ్యక్తం చేశారు.
Off The Record: వినాయక చవితి ఫ్లెక్సీల్లో ఎమ్మెల్యే ఫోటో లేదని వివాదం.. చివరకు..!