NTV Telugu Site icon

Revanth Reddy: ఆ ముగ్గురికి చెప్పకుండా చేరికలేవీ జరగవు.. విభేదాలపై రేవంత్ క్లారిటీ

Revanthreddy

Revanthreddy

Revanth Reddy: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డితో సంప్రదింపులు లేకుండా నల్గొండలో చేరిక జరగదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ లో చేరే విషయంలో కొందరు నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈరోజు హైదరాబాద్‌లోని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నివాసానికి వెళ్లారు. అక్కడ కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డిలు కాసేపు చర్చించుకున్నారు. అనంతరం నేతలిద్దరూ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు నివాసానికి బయలుదేరారు. ఆ తర్వాత మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసానికి కూడా వెళ్లనున్నారు. అయితే జూపల్లి ఇంటికి బయల్దేరిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఇద్దరు నేతలు.. పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. ఇవాళ తాను, రేవంత్ రెడ్డి మాట్లాడుకుంటామని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.

Read also: Adipurush : ప్రభాస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నటుడు సుమన్.

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కలిసి పనిచేస్తామని చెప్పారు. మరోవైపు రాహుల్ గాంధీని ప్రధానిని చేసే వరకు కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి కలిసి పనిచేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. రేపటి ఎన్నికల్లో తెలంగాణ నుంచి కనీసం 15 పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించేందుకు తాను, కోమటిరెడ్డి, ఇతర నాయకులు కలిసి కృషి చేస్తామన్నారు. ఎలాంటి వివాదాస్పద చేరికలు ఉండవని చెబుతున్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డితో సంప్రదింపులు లేకుండా నల్గొండలో చేరిక జరగదని అన్నారు. ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదని అన్నారు. వివాదాలు ఉన్నాయని అనడం సరికాదన్నారు. పార్టీలో చేరేందుకు పలు ప్రతిపాదనలు వస్తున్నాయన్నారు. ఆ తర్వాత పార్టీ స్థానిక నేతల అభిప్రాయాలు కూడా తీసుకోనున్నారు.

Jagadish Reddy: దశాబ్ది దగా పేరుతో కాంగ్రెస్ నిరసనలు.. జగదీష్ రెడ్డి సీరియస్‌

Show comments