కాంగ్రెస్ పార్టీ పరేడ్ గ్రౌండ్ లాంటిది, అక్కడ ఎవడి ఆట వాడు ప్రాక్టీస్ చేసుకుంటారు.. ప్రత్యర్థి ఎదురైనప్పుడు అంతా కలిసి ఆడతారు అని తెలిపారు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి… ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలోని పరిస్థితులు, టీఆర్ఎస్‌పై ఉన్న వ్యతిరేకత, బీజేపీ విధానాలు ఇలా అన్నింటిని ఎండగట్టారు.. ఇదే సమయంలో, కాంగ్రెస్ పార్టీలో వర్గపోరుపై స్పందిస్తూ.. పై వ్యాఖ్యు చేశారు.. ఇక, కేసీఆర్‌కు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేశారని విమర్శించిన రేవంత్ రెడ్డి.. నిజాం వారసులకంటే ధనవంతులుగా కేసీఆర్ కుటుంబ సభ్యులు మారారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.
Read Also: BJP: తెలంగాణకు అమిత్‌షా, నడ్డా.. ఈసారి ఏంటో మరి..?
తెలంగాణ ప్రజలు.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఓడిస్తారన్న సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌కు గుణపాఠం చెబుతారని జోస్యం చెప్పారు.. నిజాం వారసుల కంటే కేసీఆర్ కుటుంబసభ్యులు.. ఎక్కువ ఆస్తులు సంపాదించారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్.. అలివికాని తప్పులు చేశారని విమర్శించారు. ఇక, రాహుల్ గాంధీ నాయకత్వంలో.. ఎన్నో రాష్ట్రాల్లో విజయం సాధిస్తామన్నారు. గతంలో పంజాబ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటకలో గెలిచిన విషయాన్ని గుర్తుచేశారు. మరోవైపు, తెలంగాణలో అన్ని వ్యవస్థలు కుప్పకూలాయన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఒక వ్యవస్థలో సమస్యలు వస్తే… రీప్లేస్ చేయవచ్చన్నారు.