NTV Telugu Site icon

TPCC Chief Mahesh Goud: ఇక చాలు ఆపండి.. సినీ ప్రముఖులకు పీసీసీ చీఫ్‌ విజ్ఞప్తి..

Pcc Chief Mahesh Kumar Goud

Pcc Chief Mahesh Kumar Goud

TPCC Chief Mahesh Goud: సినీ ప్రముఖులకు పీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ విజ్ఞప్తి చేశారు. ఈ ఎపిసోడ్‌ని ఇంతటితో ముగించాలని కోరారు. మంత్రి కొండా సురేఖ భేషరతుగా తను చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నారని తెలిపారు. ఇరువైపులా మహిళలే ఉన్నారని గుర్తు చేశారు. ఈ విషయాన్ని ఇక్కడికే ముగిస్తే సమంజసంగా ఉంటుందని పీసీసీ చీఫ్‌ విజ్ఞప్తి చేశారు. కేటీఆర్ సోషల్ మీడియాలో మంత్రి మీద చేసిన ట్రోల్స్‌ కూడా సినిమా పెద్దలు గమనించాలని పీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ గుర్తుచేశారు.

Read also: Kishan Reddy: హిమాచల్ ప్రదేశ్ ఆర్థిక పరిస్థితే తెలంగాణలో రాబోతుంది.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ప్రస్తుత క్యాబినెట్ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలల్లో దుమారం రేపుతున్నాయి. నిన్న సమంత, నాగ చైతన్య విడాకులపై చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం మంత్రిపై విమర్శలతో ముంచెత్తింది. అధికారంతో అడ్డు అదుపు లేకుండా సభ్య సమాజం సిగ్గుపడేలా తమ స్వార్ధ రాజకీయాల కోసం దిగజారిపోయి మాట్లాడకూడదని పలువురు టాలీవుడ్ హీరోలు సదరు మంత్రిపై ఘాటుగా స్పందించారు. ఓక మహిళా అయి ఉండి సాటి మహిళ వ్యక్తిగత జీవితంపై కామెంట్స్ చేయడం ఎంత వరకు సబబు అనేది సదరు మంత్రి ఆలోచించుకోవాలని మండిపడుతున్నారు.

Read also: Jani Master-Bail: జానీ మాస్టర్‌కు మధ్యంతర బెయిల్!

అటు రాష్ట్ర రాజయాల్లోని ప్రముఖులు ఇటు సినిమా ఇండస్ట్రీ మొత్తం కొండా సురేఖ మాటలపై మండి పడుతున్నారు. మరోవైపు కాగా కొండా సురేఖ వ్యాఖ్యలపై నాగార్జున, అమల, నాగచైతన్య, సమంత, ఎన్టీఆర్, నాని, మోగాస్టార్ చిరంజీవి, ఆర్టీవీ, ప్రకాష్ రాజ్ సినీతారలు ఘటూగా, రియాక్ట్ అయిన విషయం తెలిసిందే. ఇక తాజాగా దీనిపై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పందించారు. కొండా సురేఖకు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఫోన్ చేశారు. సమంత.. నాగ చైతన్య వివాదం పై కొండా సురేఖతో స్వయంగా మాట్లాడి వివరణ ఇవ్వాల్సిందిగా సూచించారు. అసలు ఎందుకు ఆ మాటలు వచ్చాయన్న దానిపై తెలుపాలన్నారు. రాజకీయాల్లోకి సినిమా ఇండస్ట్రీ వారి పేర్లను ప్రస్తావించడంపై వివరణ ఇవ్వాల్సిందిగా కోరిన విషయం తెలిసిందే.
Azharuddin: మనీలాండరింగ్ కేసులో విచారణకు క్రికెటర్ అజారుద్దీన్‌కు సమన్లు!