Ponnam vs Adluri Laxman Row: జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. మంత్రి పొన్నం వ్యాఖ్యలపై తాజాగా, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పందిస్తూ.. ఓ వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన పొరపాటును ఒప్పుకొని క్షమాపణ చెబితే పొన్నంకు గౌరవంగా ఉంటుందన్నారు. మాదిగలు అంటే మీకు అంత చిన్న చూపా, అని సీరియస్ అయ్యారు. అన్న మాటను సమర్ధించుకుని ఇప్పటి వరకు రియాక్ట్ కాకుండా ఉన్నావంటే ఈ విషయం నీ విజ్ఞతకే వదిలేస్తున్నాను అని మంత్రి అడ్లూరి పేర్కొన్నారు. సహచర మంత్రిని, ఎస్సీ సామాజిక వర్గం నేతను ఆ మాట అంటుంటే చూస్తూ ఉంటావా అని మంత్రి వివేక్ వెంకటస్వామిని మంత్రి లక్ష్మణ్ కుమార్ నిలదీశారు.
Read Also: AP Politics : జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ఇక, మంత్రి పొన్నం ప్రభాకర్- అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎపిసోడ్ పై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ రంగ ప్రవేశం చేశారు. ఇద్దరు మంత్రులకు ఫోన్ చేసి ఇరువురు సంయమనం పాటించాలని చెప్పినట్లు సమాచారం. అడ్లూరినీ ఉద్దేశించి పొన్నం కామెంట్స్ చేశారని ప్రచారం.. అడ్లూరిని ఉద్దేశించి మాట్లాడలేదని పొన్నం వివరణ ఇచ్చారు. పొన్నం కామెంట్స్ నీ తప్పు పట్టిన మంత్రి శ్రీధర్ బాబు.. పార్టీకి, ప్రభుత్వానికి ఇది మంచిది కాదంటూ శ్రీధర్ బాబు హితవు పలికారు.
