HHMV : పవన్ కళ్యాణ్ నటించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘హరిహర వీరమల్లు’ రిలీజ్‌కు ముందే వివాదాల్లో చిక్కుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో తెలంగాణ యోధుడు పండుగ సాయన్న జీవితాన్ని వక్రీకరించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమకారుడు, న్యాయవాది, అలాగే పండుగ సాయన్న జీవిత చరిత్రను పుస్తక రూపంలో రచించిన బెక్కెం జనార్దన్ ఈ వివాదంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. పండుగ సాయన్న జీవితంలోని సంఘటనలను చిత్రీకరిస్తామంటూ ప్రకటించి, ఇప్పుడు అసలు చరిత్రకు వ్యతిరేకంగా, వక్రీకరించిన రూపంలో చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. సాయన్నపై వాస్తవాలను తప్పుడు కోణంలో చూపించడానికి ప్రయత్నిస్తున్నారు అని ఆరోపించారు.
Story Board: ఏపీలో వ్యవస్థీకృత దోపిడీ కొనసాగుతోందా..? ఇసుక, మట్టి, మద్యం పేరుతో బరితెగింపా..?
పండుగ సాయన్న జీవిత చరిత్రను పుస్తకంగా ప్రచురించిన వ్యక్తిగా, దాని పై అన్ని హక్కులు నాకే ఉన్నాయని ఆయన అన్నారు. ఈ హక్కులను ఉల్లంఘిస్తే న్యాయపరంగా చట్టవిధానాల ప్రకారం ముందుకెళ్తామని ఆయన వ్యాఖ్యానించారు. సినిమాలో సాయన్న చరిత్రను తప్పుగా చూపే సన్నివేశాలను తొలగించాలని, లేకపోతే సినిమాను విడుదల కాకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే హీరో పవన్ కళ్యాణ్‌పైనే కోర్టులో కేసు వేస్తాం అని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలతో సినిమాపై సరికొత్త వివాదం చెలరేగే అవకాశం ఉంది. ఇప్పటికే భారీ హైప్‌తో ఉన్న హరిహర వీరమల్లు చిత్రంపై ఈ ఆరోపణలు ఎలా ప్రభావం చూపుతాయన్నది వేచి చూడాల్సిందే. చిత్ర బృందం ఈ అంశంపై ఎలా స్పందిస్తుందో కూడా ఆసక్తికరంగా మారింది.
Bellamkonda : మరో రీమేక్ చేస్తున్న బెల్లంకొండ.. రీమేక్ స్టార్ అని ట్రోల్స్..
