NTV Telugu Site icon

Pawan Kalyan: నేడు కొండగట్టుకు పవన్‌ కల్యాణ్‌… ‘వారాహి’కి పూజలు.. పూర్తి షెడ్యూల్‌ ఇదే..

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఇవాళ కొండగట్టుకు వెళ్లనున్నారు.. జనసేన పార్టీ ప్రచార రథం వారాహి వాహనానికి జగిత్యాల జిల్లా కొండగట్టులో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.. ఆంజనేయస్వామి ఆలయంలో అక్కడ శాస్త్రోక్తంగా పూజలు జరిపించనున్నారు పవన్‌… వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ వారాహికి పూజలు నిర్వహించి పవన్ ప్రచార రథాన్ని ప్రారంభిస్తారు. అనంతరం నాచుపల్లి సమీపంలోని ఓ రిసార్టులో తెలంగాణ ముఖ్య నాయకులతో సమావేశమవుతారు. సమావేశం అనంతరం ధర్మపురి చేరుకుని లక్ష్మీ నరసింహస్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇక్కడి నుంచే అనుష్టుప్ నారసింహ యాత్రకు శ్రీకారం చుడతారు. ఇందులో భాగంగా మరో 31 నారసింహ క్షేత్రాలను దశలవారీగా సందర్శిస్తారు. ధర్మపురిలో దర్శన అనంతరం సాయంత్రం తిరిగి హైదరాబాద్‌ ప్రయాణం కానున్నారు జనసేనాని..

Read Also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

ఇక, పవన్‌ కల్యాణ్‌ కొండగట్టు, ధర్మపురి పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉదయం 7 గంటలకు హైదరాబాద్ నుండి కొండగట్టుకు బయల్దేరనున్నారు పవన్‌.. ఉదయం 11 గంటలకి కొండగట్టు అంజన్న ఆలయానికి చేరుకుంటారు.. జన సేనాని పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన బందో బస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.. పవన్ కల్యాణ్‌కు కొండగట్టు అంజన్న అంటే సెంటిమెంట్ అనే విషయం తెలిసిందే.. పలు సందర్భాల్లో ఆయన ఆ విషయాన్ని ప్రస్తావించారు.. దీంతో, వారాహికి కొండగట్టులోనే వాహన పూజ నిర్వహించాలని నిర్ణయించారు.. ఉదయం 11 గంటలకు మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంకు చేరుకోనున్న పవన్‌.. అంజన్న దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం వారాహి ప్రచార రథానికి పూజలు చేయిస్తారు.. ఇక, మధ్యాహ్నం ఒంటి గంటకు కోడీమ్యాల మండలం పరిధిలోని బృందావన్ రిసార్ట్‌లో తెలంగాణ జనసేన 32 నియోజకవర్గ కార్యానిర్వహక సభ్యులతో సమావేశం అవుతారు.. తెలంగాణలో జనసేన పార్టీ కార్యాచరణపై ముఖ్య నాయకులకు పవన్ కల్యాణ్‌ దిశా నిర్దేశం చేస్తారు.. ఆ తర్వాత సాయంత్రం 3.30 నిమిషాలకు ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్న ఆయన.. ధర్మపురి నుండి అనుష్టుస్ నారసింగ యాత్రగా 32 క్షేత్రాల సందర్శన యాత్ర ప్రారంభిస్తారు.. ఇక, సాయంత్రం 5.30 నిమిషాలకు తిరిగి హైదరాబాద్ ప్రయాణం కానున్న పవన్‌ కల్యాన్‌.. రాత్రికి హైదరాబాద్‌ చేరుకుంటారు.