NTV Telugu Site icon

MLA Mahipal Reddy: తప్పు చేస్తే ఫెనాల్టీ వేయండి.. కన్నీరు పెట్టుకున్న మహిపాల్‌ రెడ్డి..

Mla Mahipal Reddy

Mla Mahipal Reddy

MLA Mahipal Reddy: నిబంధనలకు విరుద్ధంగా సంతోష్‌ ఇసుక, గ్రానైట్‌లను నడుపుతున్న పటాన్‌ చెరు ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి సోదరుడు మధుసూదన్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో.. పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. తప్పు చేస్తే ఫెనాల్టీ వేయాలని తెలిపారు. 2011-12 లో క్వారీ లీజుకు తీసుకున్నామని, గత నాలుగేళ్లుగా మేము సొంతంగా సంతోష్ క్రషర్లు కంపెనీ పేరుతో నిర్వహిస్తున్నామని క్లారిటీ ఇచ్చారు. తప్పు చేసినట్టు రుజువు అయితే ఫెనాల్టీ వేయాలని కోరారు.

కానీ తెల్లవారుజామున 3 గంటలకు వందల మంది పోలీసులు వచ్చి అక్రమ అరెస్టులు చేశారని మీడియా ముందు కన్నీరు పెట్టుకున్నారు. కాంగ్రెస్ వచ్చిన 100 రోజుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలపై కేసులు పెడుతున్నారని వాపోయారు. పటాన్ చెరులో 40 క్రషర్లు ఉన్నాయి..అందులో చాలా వాటికి లైసెన్స్ అయిపోయిన నడుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని ఇబ్బంది పెట్టి, పార్టీలోకి లాగలని చూస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు. మా దగ్గర ఆధారాలతో క్వారీకి సంబంధించిన అన్ని పర్మిషన్లు ఉన్నాయని మహిపాల్ రెడ్డి తెలిపారు.

Read also: PM Modi: వచ్చే వారం భూటాన్ పర్యటనకు ప్రధాని నరేంద్రమోడీ..

కాగా.. మరోవైపు పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డిని పోలీసులు ఈరోజు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అతనిపై అక్రమ మైనింగ్, చీటింగ్ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్స్ నడిపారనే కారణంతో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. త్వరలో మధుసూదన్‌ను వైద్య పరీక్షల నిమిత్తం రిమాండ్‌కు తరలించే అవకాశం ఉందని తెలుస్తుంది. మధుసూదన్ రెడ్డికి సంతోష్ గ్రానైట్ మైనింగ్ అనే క్రషర్ కంపెనీ ఉంది.

నాలుగు ఎకరాల ప్రభుత్వ లీజుకు తీసుకుని మరో నాలుగు ఎకరాలను అక్రమంగా క్రషింగ్ చేశారన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. పరిమితికి మించి గుంతలు తవ్వుతున్నట్లు మైనింగ్ శాఖ నివేదిక ఇచ్చింది. కాలుష్య నియంత్రణ మండలి, మైనింగ్ శాఖ నిబంధనలు పాటించకపోవడంతో అధికారులు క్రషర్లను సీజ్ చేశారు. మధుసూదన్‌రెడ్డి అరెస్ట్‌ అనంతరం బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పటాన్‌చెరు పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. పోలీస్ స్టేషన్ ఎదుట పోలీసులు మోహరించారు.
Dr.K. Laxman: వేతనంతో కూడిన మెటర్నిటీ సెలవులు ఇప్పుడు 24 వారాలు