NTV Telugu Site icon

Parvo Virus In Dogs: తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ లో కుక్కలకు పార్వో వైరస్‌.. ఆందోళనలో ప్రజలు

Parvo Virus In Dogs

Parvo Virus In Dogs

Parvo Virus In Dogs: గ్రామాల్లో కుక్కలు ప్రజల పాలిట ప్రాణాపాయంగా మారుతున్నాయి. ఒకచోట కుక్కలు దాడి చిన్నపిల్లలు బలవుతుంటే.. మరోచోట కుక్కలకు సోకిన వైరస్.. స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ లో వైరస్ వ్యాపించిన కుక్కలు గ్రామాల్లో స్వైర విహారం చేస్తున్నాయి. ఇలా వైరల్ వ్యాపించిన కుక్కలు ఛత్తీస్‌గఢ్‌ లో కనిపించగా.. ఇప్పుడు తాజాగా నిజామాబాద్ లో కనిపిస్తున్నాయి. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చాయి కానీ పల్తితండాలో 70కి పైగా కుక్కలు ఉన్నాయి. 30కి పైగా కుక్కలకు పార్వో వైరస్ సోకింది. వ్యాధి సోకితే, వైరస్ మనుషులకు కూడా వ్యాపిస్తుంది. నల్గొండ జిల్లా పెద్దవూరు మండల పరిధిలో 26 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో 69 నుంచి 100 వీధి కుక్కలు ఉన్నాయి.

Read also: Top Headlines @ 9 AM : టాప్‌ న్యూస్‌

గ్రామాల్లో యథేచ్ఛగా తిరుగుతూ ఎవరిపైన చూసినా దాడులు చేస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం కుక్కలు ఆవు దూడను చింపి పీక్కుతిన్న దాఖలాలు ఉన్నాయి. అయితే.. ఇప్పుడు కుక్కలకు వైరస్‌ సోకడంతో ఆందోళన నెలకొంది. దాదాపు 70 కుక్కల్లో సగానికి పైగా వైరస్‌ బారిన పడ్డాయి. వాటికి బొబ్బలు, పుండ్లు, రక్తం,చీము వస్తుంది. ఆ కుక్కలపై వాలిన దోమలు మళ్లీ మనుషులను కుట్టడం వల్ల చాలా మంది వైరల్ ఫీవర్స్, నొప్పుల బారిన పడుతున్నారు. కావున దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇలాంటి కుక్కలను కార్పోరేషన్ వాళ్లు తీసుకుని వెళ్లాలని, ప్రజల ప్రాణాలను కాపాడాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు వీధిల్లో ఆడుకుంటుండగా వైరస్ వ్యాపించిన కుక్కలు ఎక్కవగా వస్తున్నాయి. వాటివల్ల పిల్లలు ప్రమాదం ఉంటుందని దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Read also: MLC Kavitha Husband Anil: నేడు సుప్రీంకు ఎమ్మెల్సీ కవిత భర్త..! మరి ఈడీ విచారణకు..?

ఛత్తీస్‌గఢ్‌లో..

మరోవైపు ఛత్తీస్‌గఢ్‌లోని బలోద్ జిల్లాలో వీధి కుక్కల మధ్య పార్వో వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. పలు జిల్లాలోని అన్ని బ్లాకుల్లోని పశువైద్యశాలల్లో ప్రతిరోజూ 4 నుంచి 5 కేసులు నమోదవుతున్నాయి. అయితే.. ఈ వైరస్ కుక్కలకు ప్రాణాంతకంగా మారడం ఏమోగానీ.. ప్రజలకు కూడా వ్యాపించి రోగాల బారిన పడుతున్నారు. ఈ వైరస్ సోకిన కుక్కలకు సకాలంలో చికిత్స అందించకపోతే చనిపోయి.. వైరల్ అంతా వ్యాపిస్తాయి. ఈ వైరస్‌ను నివారించడానికి కుక్కలకు టీకాలు వేయడం చాలా ముఖ్యమని భావిస్తున్నారు. కాగా.. దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే.. జిల్లాలో జనవరి 1 నుంచి మార్చి 15 వరకు 87 పార్వో వైరస్ కేసులు నమోదు కాగా.. అందులో 15 కుక్కలు కూడా మృత్యువాత పడ్డాయి. మరోవైపు గురుర్ జిల్లాలో ఒకరు, దౌండిలోహరలో 21, దల్లిరాజారాలో 20, దౌండిలో 5, బలోడ్‌లో 40 మందికి పార్వో వైరస్ సోకింది. వీటిలో పెంపుడు కుక్కలే ఎక్కువ. దల్లిరాజారలో 5, బలోద్‌లో 10 కుక్కలు చనిపోయాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
Singer Mangli: సింగర్ మంగ్లీకి తప్పిన పెను ప్రమాదం.. స్వల్ప గాయాలు!