NTV Telugu Site icon

Parshottam Rupala: తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే.. కేంద్రమంత్రి రూపాల

Pashottam Rupala

Pashottam Rupala

Parshottam Rupala Says BJP Will Win In 2024 Telangana Elections: ఈసారి తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని కేంద్ర మత్స్యశాఖ మంత్రి పరుషోత్తం రూపాల ధీమా వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని గడికోటను సందర్శించిన అనంతరం కేంద్రమంత్రి మాట్లాడుతూ.. పూర్వ బీజేపీ కార్యకర్తల వల్ల నేడు తెలంగాణలో బీజేపీ బలంగా తయారైందన్నారు. భారతదేశ అభివృద్ధి.. ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రధాని మోడీ చేస్తున్న అభివృద్ధిని చూసి.. మోడీని ప్రపంచ దేశాలు ఆహ్వానిస్తున్నాయని చెప్పారు. గతంలో అగ్రరాజ్యమైన అమెరికా మోడీ వీసాను నిషేధించిందని, ఇప్పుడు ఆ అగ్రరాజ్యాలే మోడీని పిలుస్తున్నాయని చెప్పారు. దేశంలో ఎక్కువ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందన్న ఆయన.. రాబోయే తెలంగాణ ఎన్నికల్లోనూ బీజేపీ గెలుస్తుందని నమ్మకం వెలిబుచ్చారు. రామ మందిరాన్ని నిర్మించిన ఘనత ప్రధాని మోడీకి దక్కుతుందని ఉద్ఘాటించారు.

Bangladesh: ఇస్లామిక్‌ ఉగ్రవాద సంస్థ చీఫ్‌ షమిన్‌ మహ్‌ఫుజ్‌ అరెస్ట్

అంతకుముందు మంచిర్యాల చెన్నూర్‌లో మాట్లాడుతూ.. తెలంగాణలో అభివృద్ధి సాధించాలంటే.. బీజేపీని గెలిపించాలని పరుషోత్తం రూపాల పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వంపై విముఖత ఉందని తాను విన్నానని, తెలంగాణకు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎన్నో నిధులు మంజూరు చేసిందని అన్నారు. మోడీ రాకముందే దేశంలో అవినీతి మాత్రమే ఉండేదని, కానీ మోడీ ప్రధాని అయ్యాక ఈ 9 ఏళ్లలో ఒక్కరు కూడా అవినీతి గురించి మాట్లాడే ధైర్యం చేయడం లేదన్నారు. కరోనా కాలంలో వ్యాక్సిన్ అందించి, ఎంతోమంది ప్రాణాలను మోడీ కాపాడారన్నారు. ఆర్టికల్ 370 కశ్మీర్ సమస్యను పరిష్కరించిన ఘనత ఒక్క మోడీకే దక్కిందన్నారు. సమర్థవంతమైన మోడీ పాలనలో దేశం అభివృద్ధి చెందుతోందన్నారు. ఆగిపోయిన 100 డ్యామ్‌ల నిర్మాణాలను మోడీ తిరిగి ప్రారంభించారని.. వాటిలో 60 డ్యామ్‌ల పని పూర్తయ్యిందని తెలిపారు. దేశంలో 11 కోట్ల మరుగుదొడ్లను సైతం కట్టించారన్నారు.

Sumeeth Reddy: ఆ ఫ్లాట్‌లో ఏం జరిగిందో మాకు తెలీదు.. సిక్కిరెడ్డి భర్త సుమీత్ క్లారిటీ