Ironically flexes: ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ నగరానికి రానున్న నేపథ్యంలో వినూత్న రీతిలో స్వాగతం పలుకుతూ ప్లెక్సీలు వెలిశాయి. ఇవాళ మధ్యాహ్నం ప్రధాని మోడీ హైదరాబాద్ కు రానున్నారు. దీంతో ‘పరివార్ వెల్కమ్స్ యు మోడీ జీ’ అంటూ.. బీజేపీ నేతలు, వారి వారసుల ఫోటోలతో కూడిన పెద్ద ఫ్లెక్సీలు పెట్టారు. తమ వారసుల ఫోటోలతో కూడిన ఈ ఫ్లెక్సీలతో బీజేపీ కీలక నేతల ఫ్లెక్సీలతో బీఆర్‌ఎస్ స్వాగతానికి తెరలేపింది. ‘మీ పరివారం మిమ్మల్ని ఆహ్వానిస్తోంది’ అంటూ వ్యంగ్యంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
ఈ ఫ్లెక్సీలో అమిత్ షా, మాధవ్ రాజ్ సింథియా, రాజ్ నాథ్ సింగ్, యడ్యూరప్ప, వసుంధర రాజ్, ప్రమోద్ మహాజన్, గోపీనాథ్ ముండే లు ఉండే నేతలు అదానీ, అంబానీ వారసులతో పాటు వారి వారసుల ఫొటోలతో కూడిన ఈ సెటైరికల్ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ ఈ విధంగా మరో ప్రచారానికి శ్రీకారం చుట్టింది. బీజేపీలోని కీలక నేతల వారసుల ఫొటోలతో అలంకరించిన ఈ ఫ్లెక్సీలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. బీజేపీ నేతలు పరివారానికే పట్టం కట్టారని బీఆర్ఎస్ శ్రేణులు విమర్శిస్తున్నాయి. కాగా వెలసిన ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
తెలంగాణలో బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. తెలంగాణ అధినేత కేసీఆర్ జాతీయ పార్టీ పేరుతో జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని ప్రయత్నిస్తుండగా.. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ వడివడిగా అడుగులు వేస్తుండడంతో.. రాజకీయాలు వేడెక్కాయి. గత కొంత కాలంగా ప్రధాని మోడీపై కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మరోసారి మోడీ తెలంగాణలో పర్యటిస్తున్న నేపథ్యంలో కేసీఆర్ ఆయనను కలవడానికి పోవడం లేదు. ప్రోటోకాల్‌లో కొంత భాగాన్ని పాటించడం లేదు. ప్రధాని మోదీకి సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ స్వాగతం పలకనున్నారు. తాజాగా ఎమ్మెల్సీ కవితపై ఈడీ విచారణలు.. 10వ తరగతి పరీక్ష పేపర్ల లీకేజీ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను అరెస్ట్ చేసి విడుదల చేసిన నేపథ్యంలో.. ఇవాళ మోదీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే సభలో దేనిపై మాట్లాడుతారు అనే దానిపై ఉత్కంఠత నెలకొంది.
Pakistan Crisis: పాకిస్తాన్‌పై మరో పిడుగు.. 2026 కల్లా రూ.63 వేల కోట్లు కట్టకపోతే..