Site icon NTV Telugu

ఈటల ఎప్పుడు దళితులను పట్టించుకోలేదు : పల్లా రాజేశ్వర్ రెడ్డి

కరీంనగర్ జిల్లా.. ఇళ్ళందకుంట మండల కేంద్రంలోని 5,6,7 వార్డుల్లోని దళిత కాలనీల్లో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దళిత భస్తిల్లో ముఖ్యంగా ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. నిన్న, మొన్నటి వరకు మంత్రిగా పని చేసిన ఈటెల రాజేందర్ ఎప్పుడు దళితులను పట్టించుకోలేదు అని అన్నారు మాకు ఒక్క ఇళ్లు కూడ ఇవ్వలేదు ముఖ్యమంత్రి కేసీఆర్ కు చెప్పి ఇళ్లు ఇప్పించాలని దళితులు నాతో చెప్పారు. ఇళ్ళందకుంటలో పక్క ఇళ్లు లేని దళితులకు ఇళ్లు ఇప్పస్తా అని హామీ ఇస్తున్నా. డిగ్రీలు, పిజిలు చేసి ఖాళీగా ఉన్న విద్యార్థులు ఉన్నారు. వారందరికి దళిత బంధు ఇప్పిస్తాం అని తెలిపారు. ఈ నెల 16న ఇక్కడకు వస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకు వెళ్ళి అందరికి దళిత బంధు, ఇండ్లు ఇపిస్తాం. ఇప్పటి వరకు దళితులకు చేసింది కేసీఆర్, చేయ బోయేది కూడా కేసీఆర్ అని పేర్కొన్నారు.

Exit mobile version