ధాన్యం కొనుగోళ్లపై ఇంకా స్పష్టత నెలకొన లేదు. తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు జరుపాలంటూ టీఆర్ ఎస నేతలు కేంద్రంపై విమర్శలు గుప్పిస్తుంటే.. తెలంగాణ బీజేపీ నేతలేమో కేంద్రం ధాన్యం కొంటామన్నా టీఆర్ఎస్ నేతలు కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. పంజాబ్ లో ఏవిధంగానైతే ధాన్యం కొంటున్నారో.. అదే విధంగా తెలంగాణలో యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆయన వ్యాఖ్యానించారు. భారతదేశంలో మేము ప్రజలము కాదా? ఆయన ప్రశ్నించారు. కేంద్రంలో ఒకటి మాట్లాడితే రాష్ట్రంలో మరోటి మాట్లాతుండ్రు అని, యాసంగిలో కేంద్రం వడ్లు కొనదు అంటే, కేసీఆర్ వరి వెయ్యొద్దు అని రైతులకు చెప్పారన్నారు.
కానీ తెలంగాణ బీజేపీ నేతలు వరి వేయాలంటూ కేంద్రం కొంటుందని అబద్దపు ప్రచారాలు చేయడంతో.. 15 లక్షల మంది వరికి బదులు వేరే పంటలు వేసుకున్నారన్నారు. కానీ.. 35 లక్షల మంది రైతులు వరి పంట వేసి మోసపోయారన్నారు. తెలంగాణ కోసం ఎలా పోరాటాలు చేసామో.. తెలంగాణలోని వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్రంపై పోరుకు సిద్ధం కావాలన్నారు. ఈ నెల 7న జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేయాలని, 8న గ్రామాల్లో ప్రతి రైతు ఇంటిపై నల్లజెండాలు ఎగురాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయాలన్నారు. యాసంగి పంట ను కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
https://ntvtelugu.com/ts-edcet-2022-shcedule-release/
