Site icon NTV Telugu

Palla Rajeshwar Reddy: కాంగ్రెస్ సర్కార్ కూలి పోతుందని నేను అనలేదు..

Palla Rejeshwer Redddy

Palla Rejeshwer Redddy

Palla Rajeshwar Reddy: కాంగ్రెస్ సర్కార్ కూలి పోతుంది అని నేను అనలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ సర్కార్ కూలి పోతుందని అనలేదని, తను అనని మాటలు అన్నట్టు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎటువంటి కామెంట్స్ చేయలేదని క్లారిటీ ఇచ్చారు.
కాంగ్రెస్ లో చెరుతరా? అని నన్ను అడిగారు… పార్టీ మారేది లేదని తేల్చి చెప్పా అన్నారు.

Read also: Malla Reddy: ప్రభుత్వ కక్ష చర్య కాదు.. భూకబ్జా ఆరోపణలపై మల్లారెడ్డి

తాజాగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలంగాణ సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కూలిపోతుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విజయం సాధించిన సంగతి తెలిసిందే. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్ తనదైన ముద్ర వేస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముక్కలవుతుందని జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఎన్ని రోజులు పడుతుందో తెలియదు కానీ వచ్చే ఏడాది మాత్రం బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని తేలిపోయింది. ప్రభుత్వాన్ని పడగొడతామని కాంగ్రెస్ నేతలు చెప్పారు. తమ పాలనపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. తాజాగా ఎమ్మెల్యే కడియం కూడా బీఆర్‌ఎస్ ప్రభుత్వం మళ్లీ ఆరు నెలల్లో అధికారంలోకి వస్తుందని, ఏడాదిలోపే అధికారంలోకి వస్తుందని చెప్పి షాక్ ఇచ్చారు. వరుసగా బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన పల్లా రాజేశ్వర్ క్లారిటీ ఇచ్చారు. తను అనని మాటలు అన్నట్లు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
Rana: రాక్షస రాజు వచ్చేసాడు… అనౌన్స్మెంట్ అదిరింది

Exit mobile version