NTV Telugu Site icon

Fair Accident: పాళికా బజార్‌ అగ్ని ప్రమాదం.. ఘటనా స్థలానికి చేరుకున్న తలసాని

Talasani Srinivas Yadav

Talasani Srinivas Yadav

Fair Accident: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం ఘటన కలకలం రేపింది. ఈ సంఘటన గురించి సమాచారం తెలిసిన వెంటనే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అక్కడికి వెళ్లారు. పరిస్థితుల్ని ఆరా తీశారు. ఎవరికి ఎటువంటి హానీ జరగలేదని తెలిపారు. సకాలంలో ఫైర్ సిబ్బంది రావడంతో ప్రమాదం తప్పిందని అన్నారు. పక్కనే వున్న లాడ్డీలో వున్న వారందరిని సురక్షితంగా పోలీసులు, ఫైర్‌ సిబ్బంది బయటకు తీసుకు వచ్చారని అన్నారు. పాళికా బజార్‌లోని ఓ బట్టల షాపులో అకస్మాత్తుగా మంటలు చలరేగాయి. పాళికా బజారులో సుమారు నాలుగు వందల షాపుల ఉన్నాయి. అక్కడే వున్న ఓ బట్టల షాపులో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. దీంతో అక్కడ దట్టంగా పొగ అలుముకుంది. బట్టల దుకాణం పక్కనే ఉన్న లాడ్జ్ ఉండటంతో ఫైర్ సిబ్బంది ఖాళీ చేయించారు. పొగలు ఇతర షాపులోకి వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్న అధికారులు. మంటలు అంటుకున్న షాపుకు చుట్టుపక్కల్లో బట్టల హోల్ సేల్ దుకాణాలు ఉన్నాయి.

Read also: West Bengal: బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో రక్తపాతం.. 20కి చేరిన మరణాల సంఖ్య..

పక్కనే వున్న మరొక బట్టల దుకాణంతోపాటు ఆయుర్వేదిక్ మెడికల్ షాప్ లోకి మంటలు విస్తరించి ఎగిసిపడుతున్నాయి. దీంతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. పొగలు ఇతర షాపులోకి వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్న అధికారులు. మంటలను ఆర్పేందుకు రంగంలోకి నాలుగు ఫైర్ ఇంజన్లు దిగి మంటలను అదుపులో తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. పక్కనే ఉన్న మరో రెండు షాపులోకి మంటలు వ్యాపించడంలో ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. షాప్‌ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ప్రజలు భయాందోళనతో పరుగులు పెట్టారు. ప్రాణాలు కాపాడు కోవడానికి ఇంట్లోనుంచి బయటకు పరుగులు తీసారు. స్థానిక సమాచారంతో ఫైర్‌ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మంటలు ఎలా చెలరేగాయి? షార్ట్‌ షర్య్కూట్‌ వల్ల మంటలు వ్యాపించాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
Delhi: 41 ఏళ్ల తర్వాత రికార్డు స్థాయిలో వర్షాలు.. అధికారులకు సెలవు రద్దు చేసిన సీఎం కేజ్రీవాల్..