NTV Telugu Site icon

Komatireddy: ఆ ప్రాజెక్టు కు జైపాల్ రెడ్డి పేరు పెడతాం..? రేవంత్ రెడ్డితో చర్చిస్తామన్న కోమటిరెడ్డి

Komatireddy Venkat Reddy

Komatireddy Venkat Reddy

Komatireddy: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన మలిదశ ఉద్యమంలో దివంగత జైపాల్ రెడ్డి ఎంతో కృషి చేశారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. తెలంగాణ రావడంలో కీలకపాత్ర పోషించారని గుర్తు చేశారు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి 82వ జయంతి వేడుకలను నెక్లెస్ రోడ్డులోని ప్రశోధి స్థల్‌లో అధికారికంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన కుటుంబసభ్యులతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. జైపాల్ రెడ్డి తెలంగాణను నిర్మిస్తారని అన్నారు. జైపాల్ రెడ్డి పేరుతో కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేస్తామని చెప్పారు. జైపాల్ రెడ్డి కృషి ఫలితంగానే హైదరాబాద్ నగరానికి మెట్రో రైలు వచ్చిందని గుర్తు చేశారు. అప్పటి ప్రధాని మన్మోహన్ సోనియాను ఒప్పించి రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేశారన్నారు.

Read also: Sumaya Reddy: ‘డియర్ ఉమ’ సినిమాతో మరో తెలుగు అమ్మాయి హీరోయిన్ గా ఎంట్రీ

హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం అవుతుందని ఏపీ నేతలు ప్రచారం చేసినా అది జరగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. తెలంగాణ చరిత్రలో ఆయన పేరు నిలిచిపోయేలా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జైపాల్ రెడ్డి పేరు పెడతామన్నారు. ఈ విషయమై సీఎం రేవంత్ రెడ్డితో చర్చిస్తానని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. మరో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ జైపాల్‌రెడ్డి జయంతి వేడుకల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. నేటి రాజకీయ నేతలు జైపాల్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా ప్రారంభించి గొప్ప నాయకుడిగా ఎదిగారని జూపల్లి అన్నారు. పార్లమెంటులో జైపాల్ రెడ్డి ప్రసంగం చేస్తే ఊరుకునేదని గుర్తు చేశారు. జైపాల్ రెడ్డి పార్లమెంటులో ప్రసంగించే సమయంలో విమర్శలకు పోకుండా సమస్యలపై మాట్లాడేవారన్నారు. పాలకుర్తి ఎత్తిపోతల పథకానికి ఎంతో కృషి చేశారన్నారు.
Chiru: మెగాస్టార్ పాటకి చిందేసిన కలెక్టర్…