NTV Telugu Site icon

59.71 లక్షల రైతులకు లబ్ధి.. ఖాతాల్లో రూ.6663.79 కోట్లు జమ

Rythu Bandhu

కరోనా కష్టసమయంలోనూ రైతులకు అండగా ఉంటుంది తెలంగాణ ప్రభుత్వం… రైతులకు పంటసాయంగా రైతు బంధు పథకం కింద ఇచ్చే సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 59.71 లక్షల మంది రైతుల ఖాతాలలో రూ.6663.79 కోట్లు జమ చేసినట్టు ప్రకటించింది కె.చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని టీఆర్ఎస్ సర్కార్.. ఇవాళ ఒకేరోజు 2.10 లక్షల మంది రైతుల ఖాతాలలో 13.02 లక్షల ఎకరాలకు గాను రూ.651.07 కోట్లు జమ అయ్యాయని.. ఇప్పటి వరకు మొత్తం 133.27 లక్షల ఎకరాలకు రైతుబంధు సాయం అందింనట్టు వెల్లడించారు.. కాగా, ఈ నెల 15వ తేదీ నుంచి రైతు బంధు పథకం డబ్బులు జమ చేస్తోంది సర్కార్.. ఈ నెల 25వ తేదీ వరకు ఇది కొనసాగనుంది.