NTV Telugu Site icon

Konda Muralidhar: మా కార్యకర్తల జోలికి వస్తే క్రేన్ కు వేలాడదీసి కొడుతా.. కొండా హాట్ కామెంట్స్

Konda Muralidhar Rao

Konda Muralidhar Rao

Konda Muralidhar: కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వస్తే క్రేన్ కు వేలాడదీసి కొడుతా అంటూ కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు హాట్ కామెంట్స్ సంచలనంగా మారింది. వరంగల్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో వర్గ విభేదాలు బయట పడ్డాయి. వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఎర్రబెల్లి స్వర్ణ ప్రమాణ స్వకారం రచ్చగా మారింది. కొండా వర్గం vs జిల్లా అధ్యక్షురాలు వర్గం వర్గపోరు బయటపడటంతో సంచలనంగా మారింది. వరంగల్ జిల్లా అధ్యక్షురాలుగా ఎర్రబెల్లి స్వర్ణ ప్రమాణ స్వీకారంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. రెండు వర్గాలు విడిపోయిన కార్యకర్తలు కొట్టుకున్నారు. గొడవకు దిగిన కార్యకర్తలను ఎర్రబెల్లి స్వర్ణ భర్త సమన్వయం సర్ది చెప్పిన ప్రయోజనం లేకుండా పోయిందని అన్నారు. వరంగల్ అధ్యక్షురాలు ప్రమాణ స్వీకరణనికి రావాలంటూ ఆహ్వానించిన కొండ దంపతులు హాజరు కాలేకపోతున్నట్లు తెలిపారు. హైదరాబాద్ లో ఉన్నాం అని కొండ దంపతులు వివరణ ఇచ్చారు.

అయితే సాయంత్రం వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కొండ దంపతులు చేరికాల సమావేశం పెట్టారు. దీంతో ఈ సమావేశంపై కొండా మురళీధర్‌ హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వస్తే క్రేన్ కు వేలాడదీసి కొడుతా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా అన్నారు. కార్యకర్తలకు కొండా కుటుంబం 24 గంటలు అందుబాటులో ఉంటుందని అన్నారు. కార్యకర్తలను వేధిస్తే మొదటగా పోలీసులను ఆశ్రయిస్తామని అన్నారు. పోలీసులతో న్యాయం జరగకుంటే పాత కొండా మురళిని బయటకు తీస్తా అని కీలక వ్యఖ్యాలు చేశారు. కాంగ్రెస్ పార్టీలోకి కొత్తగా వచ్చిన నాయకులు గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తారని అన్నారు. కార్యకర్తలు అయోమయానికి గురికావొద్దని సూచించారు. కొండా సురేఖ వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండే పోటీ చేస్తుందని, కార్యకర్తలంతా ఐక్యతతో పనిచేసి భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని కోరారు.
Vimanam: ‘విమానం’ ట్రైలర్ లాంచ్ చేసిన మలయాళ బ్యూటీ…