NTV Telugu Site icon

Grace Children Home Incharge: అకౌంటెంట్ అత్యాచారంపై మాకు చెప్పలేదు.. ఇప్పుడు ఎందుకు

Grace Children Home Incharge

Grace Children Home Incharge

Grace Children Home Incharge: హైదరాబాద్‌ లోని బంజారాహిల్సా్‌ డి.ఏ.వీ స్కూల్ ఘటన మరువక ముందే భాగ్యనగరంలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రేస్ అనాధాశ్రమంలో మైనర్ బాలికపై అత్యాచారం సమా ఘటన వెలుగులోకి వచ్చింది. నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జేజే నగర్ లోని గ్రేస్ అనాదాశ్రమంలో మైనర్ బాలికపై అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే దీనిపై స్పందించిన గ్రేస్ చిల్డ్రన్ హోం ఇంచార్జి విక్టర్‌ మాట్లాడుతూ.. ఈ నెల 19 వ తేదీన నలుగురు అమ్మాయిలు పారిపోయారని, అందులో ఒకరు మేజర్, ముగ్గురు మైనర్లు ఉన్నారని అన్నారు. మేజర్ అమ్మాయితో పాటు మరో అమ్మాయి నర్సింగ్ చదువుతున్నారని తెలిపారు. వీరిద్దరు ఇళ్ళలోంచి గతంలో పారిపోయిన వాళ్ళు అన్నారు. వీరిద్దరు పారిపోతూ పారిపోతూ మరో ఇద్దరు మైనర్లను వెంట తీసుకెళ్ళారని తెలిపారు. నలుగురిని పోలీసుల సహాయంతో గుర్తించి సఖీ సెంటర్ కు పంపించామని అన్నారు.

Read also: Indian Coast Guard: 20 మంది బంగ్లాదేశ్‌ జాలర్లను కాపాడిన భారత కోస్ట్‌ గార్డ్స్

సఖీ సెంటర్ లో కౌన్సిలింగ్ సమయంలో నర్సింగ్ చదువుతున్న అమ్మాయిలు, అకౌంటెంట్ మురళి లైంగిక దాడి చేసినట్లు చెప్పిందని, ఫిబ్రవరిలో తమను బయటికి తీసుకెళ్లి తమపై మురళి లైంగిక దాడికి పాల్పడినట్లు చెప్పారు. ఈ విషయాన్ని అప్పుడు మా దృష్టికి తీసుకురాలేదని విక్టర్‌ అన్నారు. ఇప్పుడెందుకు మురళిపై అభియోగాలు చేస్తున్నారో తెలియదని అన్నారు. పారిపోయిన తరువాత మురళికే వాళ్ళిద్దరు ఫోన్ చేశారన్నారు. మురళి మా సెంటర్ లోనే చదువుకున్నాడు, కోవిడ్ లో జాబ్ లేకపోవడంతో అకౌంటెంట్ గా జాబ్ చేస్తున్నాడని అన్నారు. జువైనల్ జస్టిస్ యాక్ట్ లో మార్పులు వచ్చినా తరువాత ఆఫీసును మార్చాము, మురళి అక్కడే ఉంటున్నాడని అన్నారు. ఎప్పుడు మురళిని అన్నా అని సంభోధిస్తారని అన్నారు. లైంగికదాడికి సంబంధించిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని, తప్పు ఎవరు చేసినా వారికి శిక్ష పడాలనే కోరుకుంటున్నామని గ్రేస్ చిల్డ్రన్ హోం ఇంచార్జి విక్టర్‌ తెలిపారు.

Read also: RRR Wins International Award: వసూళ్లలో రికార్డులు, అవార్డులు.. తగ్గని ట్రిపుల్ఆర్ క్రేజ్

ఈ నెల 19న నాడు నలుగురు బాలికలు తమ అనాధాశ్రమం నుంచి కనిపించకుండా పోయారని నేరేడ్మెట్ పోలీసులకు నిర్వాహకులు ఫిర్యాదు చేసారు అనాధన ఆశ్రమ నిర్వాహకులు. నేరేడ్‌ మెట్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించాగా ఇద్దరు బాలికలు సికింద్రాబాద్ లో దొరికగా, మరో ఇద్దరు రెండు రోజులు తరువాత వారి బంధువుల ఇంట్లో దొరికినట్లు సమాచారం అనంతరం పోలీసులు వీరిని కౌన్సిలింగ్ కొరకు సఖి సెంటర్ కు తరలించగా అసలు విషయం తెరపైకి వచ్చింది. రేప్ సంఘటన వెలుగులోకి వచ్చింది. అదే అనాధాశ్రమంలో అకౌంటెంట్ గా పని చేస్తున్న మురళి అనే యువకుడు తనను లైంగికంగా వేధిస్తున్నాడని, భరించలేక అక్కడినుంచే అందుకనే తమకు అక్కడ ఉండటం ఇష్టం లేక తప్పించుకునే ప్రయత్నం చేసామని మినార్ బాలిక సఖి సెంటర్ లో తెలిపినట్లు సమాచారం.నిందితులు ఎవరైనా సరే కఠినంగా శిక్షిస్తామని తెలిపిన విషయం తెలిసిందే..