NTV Telugu Site icon

Shamshabad Airport: కొనసాగుతున్న ఆపరేషన్ చిరుత.. బోన్ లో మేక ను ఉంచి..

Operetion Chirutha

Operetion Chirutha

Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఆపరేషన్ చిరుత కొనసాగుతుంది. చిరుతను పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు రెండురోజులుగా శ్రమిస్తున్నారు. 9 ట్రాప్ కెమెరాలు, ఒక బోన్ ఏర్పాటు చేశారు. బోన్ లో మేకను ఉంచి పులిని బంధించేందుకు ఫారెస్ట్ అధికారులు ప్లాన్ వేశారు. మరి ప్లాన్ వలలో చిరుత చిక్కుకుంటుందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిన్న ఫెన్సింగ్ దూకుతుండటం కెమెరాలో రికార్డు అయ్యింది కానీ.. ఆ తరువాత చిరుత ఎక్కడికి వెళ్లింది, దాని ఆనవాలు అయితే కనిపించలేదు. అయితే శంషాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో కావడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు చిరుతను పట్టుకునేందుకు కంటిమీద కునుకులేకుండా శ్రమిస్తున్నారు.

Read also: Gold Price Today : పసిడి ధరలకు బ్రేకులు.. స్థిరంగా వెండి ధరలు..

ఎయిర్ పోర్ట్ తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గొల్లపల్లి వద్ద చిరుత ఎయిర్ పోర్ట్ ప్రహరీ నుండి దూకడం.. చిరుతతో పాటు రెండు చిరుత పిల్లలు కూడా సంచరిస్తున్నట్లు ఎయిర్పోర్ట్ అధికారులు గుర్తించారు. ఎయిర్ పోర్ట్ ప్రహరీ దూకుతుండగా ఫెన్సింగ్ వైర్లకు చిరుత తగలడంతో ఎయిర్ పోర్ట్ కంట్రోల్ రూమ్ లో అలారం మోగడంతో.. కంట్రోల్ రూమ్ సెక్యూరిటీ అధికారులు అప్రమత్తమయ్యారు. సీసీ కెమెరాలను పరిశీలించడంతో చిరుత సంచరించినట్లు గుర్తించారు. చిరుతతో పాటు రెండు చిరుత పిల్లలు ఉన్నట్లు కెమెరాలో రికార్డు అయ్యింది. అటవిశాఖ అధికారులకు సమాచారం అందించడంతో ఎయిర్ పోర్ట్ లోకి చేరుకున్న అటవిశాఖ అధికారులు చిరుతను బంధించేందుకు ఏర్పాటులో పడ్డారు.

Read also: Elections 2024: నామినేషన్ల ఉప సంహరణకు నేడే డెడ్‌లైన్‌.. బరిలో నిలిచేది ఎవరో తేలిపోనుంది..

చిరుత కదలికలను పరిశీలించేందుకు సీసీ కెమెరాలు, బోన్ లు ఏర్పాటు చేశారు అటవీశాఖ అధికారులు. దాదాపు మూడేళ్ల క్రితం చిరుతపులి విమానాశ్రయం గోడపై నుంచి దూకిన ఘటన అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. చిరుత విమానాశ్రయం గోడ దూకి గోల్కొండ, బహదూర్ గూడ వైపు వెళుతున్నట్లు కనిపించింది. కాగా.. ఇప్పుడు మరోమారు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు పరిసరాల్లో చిరుత సంచారం ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తుంది. రెండు రోజులుగా చిరుత కోసం ఫారెస్ట్ అధికారులు గాలిస్తున్నారు. ట్రాప్ కెమెరాల్లో చిరుత సంచరించినట్లు తెలిస్తే… అదే ప్రాంతంలో ఈరోజు ఫారెస్ట్ అధికారులు చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
UttaraKhand : రైలు – పట్టాల మధ్య ఇరుక్కున్న ప్రయాణికులు ప్రాణాలకు తెగించి కాపాడిన లేడి కానిస్టేబుల్