NTV Telugu Site icon

Operation Chirutha: 2వ రోజు కొనసాగుతున్న ఆపరేషన్ చిరుత.. ఇంకా లభించని ఆచూకీ

Shamshabad Chiruta

Shamshabad Chiruta

Operation Chirutha: శంషాబాద్ ఎయిర్‌పోర్టు రన్‌వేపై చిరుత కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.. చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు రెండు రోజులుగా శ్రమిస్తున్నారు. అయితే.. ఇవాళ 2వ రోజు కూడా చిరుత ఆచూకీ లభించలేదు. చిరుత కోసం అటవీశాఖ అధికారులు గాలిస్తున్నారు. చిరుత కోసం 20 ట్రాప్ కెమెరాలు, రెండు బోన్లను ఏర్పాటు చేశారు. నిన్న ట్రాప్ కెమెరాకు చిరుత కనిపించింది. అయితే.. బోన్ వద్దకు వచ్చినట్టే వచ్చి చిరుత వెళ్లిపోయింది. మేకను ఏరగవేసి చిరుతను ట్రాప్ చేస్తున్న అధికారులు. షాద్ నగర్ వైపు వచ్చినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. చిరుతకి 2 సంవత్సరాల వయసు ఉంటుంది అధికారులు అంచనావేస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లో చిరుతకు బంధిస్తామని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

Read also: New Rules From 1st May: గ్యాస్ సిలిండర్ నుంచి క్రెడిట్ కార్డ్ వరకు.. రేపటి నుంచి మారే రూల్స్ ఇవే

శంషాబాద్ ఎయిర్‌పోర్టు రన్‌వేపై శనివారం తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గొల్లపల్లి వద్ద చిరుత ఎయిర్ పోర్ట్ ప్రహరీ నుండి దూకడం.. చిరుతతో పాటు రెండు చిరుత పిల్లలు కూడా సంచరిస్తున్నట్లు ఎయిర్పోర్ట్ అధికారులు గుర్తించారు. ఎయిర్ పోర్ట్ ప్రహరీ దూకుతుండగా ఫెన్సింగ్ వైర్లకు చిరుత తగలడంతో ఎయిర్ పోర్ట్ కంట్రోల్ రూమ్ లో అలారం మోగడంతో.. కంట్రోల్ రూమ్ సెక్యూరిటీ అధికారులు అప్రమత్తమయ్యారు. సీసీ కెమెరాలను పరిశీలించడంతో చిరుత సంచరించినట్లు గుర్తించారు. చిరుతతో పాటు రెండు చిరుత పిల్లలు ఉన్నట్లు కెమెరాలో రికార్డు అయ్యింది. అటవిశాఖ అధికారులకు సమాచారం అందించడంతో ఎయిర్ పోర్ట్ లోకి చేరుకున్న అటవిశాఖ అధికారులు చిరుతను బంధించేందుకు ఏర్పాటులో పడ్డారు.
Amit Shah On Reservations: రిజర్వేషన్లను తొలగిస్తామనేది పచ్చి అబద్దం.. మాకు 400 సీట్లు పక్కా..!