NTV Telugu Site icon

Online Betting Crime: విషాదం.. యువకుడ్ని బలి తీసుకున్న ఆన్‌లైన్ బెట్టింగ్

Online Betting Case

Online Betting Case

Online Betting Took A Life Of Boy In Hyderabad: ఆన్‌లైన్ బెట్టింగ్స్ ఎందరో జీవితాల్ని నాశనం చేశాయి. కొందరి ప్రాణాల్ని సైతం బలి తీసుకుంది. ఇప్పుడు ఈ ఆన్‌లైన్ బెట్టింగ్ ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. చేతికి అందివచ్చిన కొడుకుని పొట్టనబెట్టుకుంది. తల్లి దాచిన బంగారాన్ని బెట్టింగ్‌లో ఓడిపోవడం, తల్లి నిలదీయడంతో.. తీవ్ర మనస్థాపానికి గురైన ఓ యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని పహాడీ షరీఫ్​ పోలీస్‌​స్టేషన్​ పరిధిలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..

Tamilisai Soundararajan: నడుస్తూ నడుస్తూ ..కిందపడ్డ గవర్నర్ తమిళిసై

మామిడిపల్లికి చెందిన చంద్రయ్య, శశికళ దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. పెద్దకుమారుడు రాజశేఖర్​ (26) ఇంటర్మీడియట్​ వరకు చదివాడు. కొంతకాలం నుంచి శంషాబాద్​ ఎయిర్​‌పోర్టులో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న రాజశేఖర్‌.. గత సంవత్సరం నుంచి ఆన్‌లైన్‌లో ప్లేయింగ్ కార్డ్స్, క్రికెట్ బెట్టింగ్‌లకు బానిసయ్యాడు. ఏదో ఒకరోజు జాక్‌పాట్ తగులుతుందన్న ఆశతో.. అతడు బెట్టింగ్స్ వేయడం షురూ చేశాడు. అయితే.. ఆ బెట్టింగ్స్ వల్ల ఇతనికి డబ్బులు రాకపోగా, అప్పుడు ఎక్కువ అయ్యాయి. మూడు నుంచి నాలుగు లక్షల వరకు డబ్బులు పోగొట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా.. బీరువాలో తల్లి శశికళ దాచిపెట్టిన బంగారాన్ని సైతం కుదవపెట్టి, బెట్టింగ్‌లో ఓడిపోయాడు.

Cantonment By Election: కంటోన్మెంట్ కి ఉప ఎన్నిక లేనట్టే.. ఎందుకంటే?

కట్ చేస్తే.. శివరాత్రి సందర్భంగా ఈనెల 18వ తేదీన సాయంత్రం 4గంటలకు శశికల బీరువాను క్లీన్ చేస్తుండగా, అందులో తాను దాచిపెట్టిన తులంనర బంగారం కనిపించలేదు. దీంతో తన భర్తతో పాటు ముగ్గురు పిల్లలను అడిగింది. రాజశేఖర్‌నూ ‘నువ్వు తీశావా?’ అంటూ గట్టిగా నిలదీసింది. అతడు భయంతో తాను తీయలేదని సమాధానం ఇచ్చాడు. అదే రోజు రాత్రి డ్యూటికని వెళ్లిన రాజశేఖర్.. ఆ బంగారం తానే తీసుకున్నానని, ఆన్‌లైన్ బెట్టింగ్‌లో పోగొట్టుకున్నానని, శంషాబాద్‌లో ఓ వ్యక్తి వద్ద రూ.40 వేలకు కుదవపెట్టానని, దానికి సంబంధించిన స్లిప్‌లు తన మొబైల్​ పోచ్​ వెనుక ఉన్నాయని మెసేజ్ చేశాడు. తాను చేసిన తప్పుకి ఆత్మహత్య చేసుకుంటున్నానని కూడా అందులో పేర్కొన్నాడు.

Celebrities Heart Strokes: పునీత్ నుంచి తారకరత్న దాకా.. 18నెలల్లో ఏడుగురు మృత్యువాత

తల్లిని, తండ్రిని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తూ.. తన సోదరుడికి ఆదివారం తెల్లవారుజామున 2.44 గంటలకు మెసేజ్​ చేశాడు. అయితే.. ఆ సమయంలో అందరూ నిద్రపోయి ఉండటంతో, ఆ మెసేజ్‌ని ఎవ్వరూ చూసుకోలేదు. అయితే.. ఎప్పట్లాగే తండ్రి చంద్రయ్య ఉదయం 5గంటలకు పాలు పితికేందుకు షెడ్ వద్దకు వెళ్లాడు. అక్కడ వేపచెట్టుకు రాజశేఖర్​ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకొని ఉండడం చూసి.. ఒక్కసారిగా షాకయ్యాడు. అతని మరణవార్త విని.. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.