Site icon NTV Telugu

Loan Apps : లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలి

Lone1

Lone1

తెలుగు రాష్ట్రాల్లో ఆన్‌లైన్ లోన్‌ యాప్‌ల నిర్వాహకుల ఆగడాలు శృతిమించుతున్నాయి. పోలీసులు దాడులతో కొన్నాళ్ల పాటు ఆగిన వేధింపులు మళ్లీ షురూ అయ్యాయి. ఎటువంటి ఆధారాలు అవ‌స‌రం లేదు. కేవ‌లం మీ ఆధార్ పాన్ కార్డ్ వుంటే చాలంటూ అమాయ‌కుల‌కు ఎర‌వేస్తున్నారు. వారిఎర‌లో పడ్డవారికి వేధింపులకు గురిచేస్తున్నారు. యాప్‌ల ద్వారా లోన్లు తీసుకున్న వారికి ఫోన్లు చేస్తూ వేధిస్తున్న నిర్వాహకులు.. అంతటితో ఆగకుండా వారి స్నేహితులు, బంధువులకు సైతం ఫోన్లు చేసి పరువు తీస్తున్నారు. వారి ఫోటోల‌పై, బంధువ‌ల ఫోటోల‌పై నానా మాట‌లు రాసి షోస‌ల్ మీడియాలో పోస్ట్ లు చేస్తారు. అది భరించని వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజా ఇలాంటి ఘ‌ట‌నే హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చింది. ఆన్‌లైన్ యాప్‌ నిర్వాహకుల వేధింపులకు ఓ యువకుడు బ‌లయ్యాడు.

లోన్ యాప్స్ వేధింపులు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్ప‌డిన ఘ‌ట‌న జవహార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చెన్నపురం సాయి గణేష్ కాలనీలో చోటుచేసుకుంది. మహమ్మద్ ఖాజా అనే యువ‌కుడు లోన్ యాప్స్ లో కొంత డ‌బ్బును తీసుకున్నాడు దాంతో అత‌ని వేధింపులు మొద‌ల‌య్యాయి. నిరాశ‌చెందిన మ‌హమ్మ‌ద్ ఖాజా చివ‌రికి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. స్థానిక స‌మాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసున‌మోదు చేశారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ తరలించారు.

ఇలాంటి దారుణాలు తెలంగాణ‌లో కాదు ఆంధ్ర రాష్ట్రంలో కూడా చోటుచేసుకుంది. విజ‌య‌వాడ‌లోని కొండపల్లికి చెందిన ఓ యువకుడు వివిధ యాప్ల ద్వారా రూ.7.52.024 రుణం తీసుకున్నాడు. అధిక వడ్డీతో కలిపి రూ. 14.38.107 వరకు కట్టాడు. అయినా.. రుణయాప్లకు సంబంధించిన ఉద్యోగులు ఫోన్ చేసి ఇంకా చెల్లించాల్సి ఉందని వేధించే వారు. అభ్యంతరకరమైన భాషలో మాట్లాడేవారు. యువకుడి ఫొటోలను మార్ఫింగ్ చేసి నగ్నంగా మార్చి వాటిని వాట్సాప్ ద్వారా పంపి బెదిరించేవారు. వీటిని తట్టుకోలేక చివ‌ర‌కు ఆ యువ‌కుడు పోలీసులను ఆశ్రయించాడు.

విజయవాడ శివారు ప్రాంతానికి చెందిన ఓ యువతి ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఆమె రూపీ వే, హ్యాండీ లోన్, ఫెయిర్ క్రెడిట్, హనీ లోన్, క్విక్ లోన్, క్యాష్ జీ, యాక్షన్ క్యాష్, క్యాష్ అడ్వాన్స్, తదితర యాప్ల ద్వారా రూ. 55.435 మేర రుణం తీసుకుంది. దీనికి గాను ఆమె రూ. 2 లక్షలు వరకు చెల్లించింది. భేదింపులు తప్పలేదు.

ఇటువంటి వాటి జోలికి వెళ్లకపోవడం ఉత్తమమ‌ని . వీటి నుంచి రుణం తీసుకుని, చెల్లించినా వేధింపులకు గురైతే తక్షణమే పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేయాలని విజయవాడ సైబర్ పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, తెలంగాణ పోలీసు యంత్రాంగం చెబుతున్నారు. ఇప్పటి వరకు వచ్చిన ఫిర్యాదులకు సంబంధించి కేసులు నమోదు చేశాం. ఐటీ చట్టంలోని సెక్షన్ 67, 67బి కింద కేసు పెట్టాం. రెండేళ్ల తర్వాత ఈ తరహా ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. వేధింపులు లాంటివి ఏమైనా వుంటే పోలీసుల‌కు ఆశ్ర‌యించాల‌న్నారు.

Chain Snatching: రెచ్చిపోయిన చైన్‌స్నాచర్లు.. ఒంటరిగా వెళ్తున్న మహిళలే లక్ష్యంగా..

Exit mobile version