One More Notification From Telangana State Public Commission.
గత అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ తెలంగాణలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే వివిధ శాఖల్లోని ఖాళీల భర్తీ వరుసగా నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. అయితే ఈ క్రమంలోనే తాజాగా టీఎస్పీఎస్సీ మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
అసిస్టెంట్ మోటార్ ఇన్‌స్పెక్టర్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది టీఎస్పీఎస్సీ. అసిస్టెంట్ మోటార్ ఇన్‌స్పెక్టర్ పోస్ట్ ల భర్తీకి సంబంధించి 113 పోస్ట్ లకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. అయితే.. ఆగస్టు 5వ తేదీ నుండి సెప్టెంబర్ 5వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ జరుగతుందని టీఎస్పీఎస్సీ అధికారులు వెల్లడించారు.