ఇటీవల బేగం బజార్‌లో నీరజ్ పన్వార్ పరువు హత్య సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో మరొకరిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. నిందితుల్లో పరారీలో ఉన్న ఏ5 మహేష్ గోటియ యాదవ్ (21)ను వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. పుణెలో మహేష్ అహియార్ గోటియ యాదవ్ ను వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటికే విజయ్ యాదవ్, సంజయ్ యాదవ్, రోహిత్ యాదవ్, ఒ మైనర్ బాలుడు లను పోలీసులు రిమాండ్ తరలించారు.
అయితే ఇప్పుడు మహేష్ అహీర్ యాదవ్(21) ను రిమాండ్ తరలించనున్న షాహీ నాథ్ గంజి పోలీసులు తెలిపారు. ఇంకా పరారీలో ఉన్న బేగం బజార్ కోల్సివాడ కు చెందిన అభినవ్ యాదవ్ ( 26 ) కోసం వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ & షాహినాద్ గంజి పోలీసులు గాలిస్తున్నారు. అయితే.. ఇప్పటికే నీరజ్ హత్య కేసులో నిందితుల రిమాండ్ రిపోర్టును పోలీసులు బయట పెట్టారు. అవమానం భారంతోనే నిందితులు నీరజ్‌ను హతమార్చినట్లు ఒప్పుకున్నారు.
