NTV Telugu Site icon

Karimnagar: ‘నేను నాగకన్యను.. నాకు గుడి కట్టండి’.. యువతి వింత ప్రవర్తన

Karimnagar

Karimnagar

Nagakanya In Karimnagar District: కరీంనగర్ జిల్లాలోని ఓ యువతి వింతగా ప్రవర్తించింది. తనను నాగదేవత ఆవహించిందని.. తనకు గుడికట్టాలని అంటోంది. అంతేకాకుండా ఆమె నాగినిలా నాట్యం చేస్తోంది. తన శరీరంపై గీతలు ఏర్పడుతున్నాయని చూపిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఎగ్లాస్ పూర్‌కు చెందిన యువతి కృష్ణవేణి ప్రవర్తన ఇప్పుడు గ్రామం మొత్తం చర్చనీయాంశంగా మారింది. కృష్ణవేణి డిగ్రీ వరకు చదివి ప్రైవేట్ స్కూలులో టీచరుగా పని చేస్తోంది. తల్లిదండ్రులు కొన్నేళ్ల క్రితమే చనిపోయారు. దీంతో ఆమె నానమ్మ దగ్గర నివసిస్తోంది. అయితే నాలుగేళ్లుగా యువతి తాను నాగకన్యను అంటూ వింతగా ప్రవర్తిస్తోంది.

Read Also: Waltair Veerayya: మూల విరాట్ ఆంధ్రాలో… మాస్ మహారాజ్ తెలంగాణాలో…

కాగా చాలా ఏళ్ల క్రితమే తాను నాగకన్యగా మారానని కృష్ణవేణి గ్రామస్తులకు చెప్తోంది. తన కలలో పాములు కనిపిస్తున్నాయని కూడా వివరిస్తోంది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల వారు, గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామశివారులో ఉన్న నాగదేవత వద్ద కూలిపోయిన ఆలయాన్ని తిరిగి నిర్మించాలని, అప్పుడే తనలో ఉన్న నాగదేవత వదిలి వెళ్లిపోతుందని కృష్ణవేణి పట్టుబడుతోంది. అయితే కొందరు కృష్ణవేణిని సమర్ధిస్తుండగా మరికొందరు మాత్రం ఆమె ప్రవర్తన తేడాగా ఉందని కొట్టిపడేస్తున్నారు. కృష్ణవేణి మానసిక పరిస్థితి ఏ మాత్రం బాగోలేదని.. అందుకే ఇలా వింతగా ప్రవర్తిస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు.

Show comments