NTV Telugu Site icon

ఇంగ్లాండ్ తాజా అధ్యయనం: ఒక్క వ్యాక్సిన్ డోసుతో… 

కరోనా కేసులపై ఇంగ్లాండ్ కు చెందిన ప్రజారోగ్య విభాగం ఓ అధ్యయనం నిర్వహించింది.  ఈ అధ్యయనం ప్రకారం మొదటి డోస్ తీసుకున్న వారిలో కరోనాను నిలువరించే శక్తి 80శాతం పెరిగిందని, ఫలితంగా మొదటి డోస్ తీసుకున్నాక 80శాతం మేర కేసులు తగ్గాయని ఇంగ్లాండ్ ప్రజారోగ్య సంస్థ పేర్కొన్నది.  ఫైజర్ వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్న అనంతరం 80శాతం రక్షణ కల్పిస్తున్నట్టు ప్రజారోగ్య సంస్థ పేర్కొన్నది.  రెండో డోసులు తీసుకున్నాక 97 శాతం రక్షణ కల్పిస్తున్నట్టు ఇంగ్లాండ్ ప్రజారోగ్య సంస్థ పేర్కొన్నది.  ఇంగ్లాండ్ లో వ్యాక్సిన్ తీసుకున్నాక 80 ఏళ్లకు పైబడిన వృద్దులు ఆసుపత్రుల్లో చేరే ప్రమాదం 93శాతం తగ్గినట్టు ఇంగ్లాండ్ ప్రజారోగ్యసంస్థ పేర్కొన్నది.