KCR: వివాదాస్పద వ్యాఖ్యలు.. కేసీఆర్ నాలుక కోస్తే కోటి రూపాయలు…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేతలు విమర్శలు, ఆరోపణలు చేసుకోవడం సర్వ సాధారణ విషయం.. కానీ, కొన్నిసార్లు విమర్శలు చేస్తూ నోరు జారడం వివాదాస్పదంగా మారి.. విమర్శలకు దారితీసిన సందర్భాలు కూడా చాలా ఉంటాయి.. అలాంటి పరిస్థితి ఇప్పుడు ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ ఐక్య వేదిక జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ భరత్ వాఘ్మారేకు వచ్చింది.. తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి… హైదరాబాద్‌లో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. రాజ్యాంగంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం కేసీఆర్ నాలుక కోసిన వారికి కోటి రూపాయలు బహుమతిగా ఇస్తానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు.. సీఎం కేసీఆర్‌కి దమ్ము, ధైర్యం ఉంటే రాజీనామా చేసి రాజ్యాంగం మారుస్తాననే నినాదంతో ఎన్నికల్లోకి వెళ్లాలని సూచించారు.
మరోవైపు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారైనా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి, వర్థంతి సందర్భంగా ట్యాంక్‌బండ్‌లోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేశారా? అని ప్రశ్నించారు భరత్.. అసలు అంబేద్కర్ అంటే కేసీఆర్‌కు గౌరవమే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, పరిస్థితులకు అనుగుణంగా సవరణలు చేసుకోవచ్చని భారత రాజ్యాంగంలోనే ఇందని గుర్తుచేసిన ఆయన.. ఇప్పటివరకు 130 సార్లు రాజ్యాంగాన్ని సవరించారు.. అలాంటిది ఏకంగా రాజ్యాంగాన్నే మారుస్తామనడం సీఎం కేసీఆర్ అహంకారానికి నిదర్శనం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. తక్షణమే అంబేడ్కర్ విగ్రహంవద్ద ముక్కు నేలకు రాసి కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Also Read
- Ration Dealers: రేషన్ డీలర్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం.. అర్హులు వీరే..
- Siddipet District: వివాహేతర సంబంధం.. యువకుడికి కొట్టి చంపిన మహిళ కుటుంబీకులు..
- Balka Suman: బాల్క సుమన్‌కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి మెజిస్ట్రేట్
- Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
- Tags
తాజావార్తలు
-
Gender Determination Racket : చిత్తూరు జిల్లాలో అక్రమ లింగ నిర్ధారణ రాకెట్ గుట్టురట్టు..
-
Kohli-Venkatesh Iyer: ఐపీఎల్ ఫైనల్లో మొదటిసారిగా.. అరుదైన రికార్డు సాధించిన కోహ్లీ, వెంకటేష్ అయ్యర్..
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Samsung Galaxy F70e 5G: సామ్ సంగ్ గెలాక్సీ F70e 5Gపై భారీ డిస్కౌంట్.. 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Nepal: నేపాల్ భారత భూభాగాలను ఆక్రమించుకుంది.. బాలెన్ షా సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!