సరిగ్గా రెండు నెలల క్రితం ఇదే గోదాం అగ్రిప్రమాదం జరుగగా.. మరల ఈ రోజు అదే గోదాంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.. సికింద్రాబాద్ రాణి గంజ్ లోని ఫిలిప్స్ లైట్స్ గోదాంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి.. విషయం గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైర్ ఇంజిన్ లతో మంటలు అదుపులో కి తెచ్చారు..పై అంతస్తూ వరకు మంటలు వ్యాపించగా .. గోదాం లో ఉన్న సామగ్రి మొత్తం అగ్నికి ఆహుతి అయ్యింది..కేస్ నమోదు చేసుకున్న పోలీసులు ..రెండో సారి కూడా ప్రమాదం జరగడం పై అరా తీస్తున్నారు.. భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని అధికారులు వెల్లడించారు.
షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చేలరేగినట్లు అధికారులు భావిస్తున్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలు కాలిబూడిదయ్యాయి. అయితే ఈ ఏడాదిలో ఇదే షాప్ లో రెండో ప్రమాదం… గత జనవరిలో కూడా ఇదే షాప్ లో అగ్నిప్రమాదం జరిగింది. అయినప్పటికీ వేద్ ఎలక్ట్రానిక్ షాప్ యాజమాన్యం ఫైర్ జాగ్రత్త తీసుకోలేదని స్థానికుల మండిపడుతున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన మహంకాళి డివిజన్ ఏసిపి రమేష్ మాట్లాడుతూ.. మాకు రాత్రి 10 గంటలకు ఇన్ఫర్మేషన్ వచ్చింది..పొగలు రావడంతో మా పోలీసులు చూసి వెంటనే స్పందించారు. ఎటువంటి ప్రాణ నష్టం లేదు… ఎలక్ట్రిక్ సామాన్లు కావడంతో మొత్తం కాలిపోయాయి. ఎంత నష్టం అనేది ఇప్పుడు చెప్పలేం…. ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ అనేది మా అంచనా. ప్రొద్దున చెప్తాం ఏం జరిగిందో అనేది అని ఆయన వెల్లడించారు.
