Site icon NTV Telugu

Etela Rajender : ప్రశాంత్ కిషోర్ ఆలోచనలతో ఇక్కడ ఓట్లు రాలవు

BJP MLA Etela Rajender Fired on CM KCR.

బీజేపీ ఎమ్మెల్య ఈటల రాజేందర్‌ మరోసారి సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఇక్కడ ఉన్న ప్రభుత్వం మాటలకే పరిమితం అయ్యింది కానీ చేతల్లో చేయడం లేదని ఆయన ఆరోపించారు. కేసీఆర్‌ అనేక సభలలో రాష్ట్రం అణగారిన వర్గాల వైపు ఉంటుందని చెప్పి, 8 ఏళ్లు అయినా వారి జీవితాల్లో మార్పు రాలేదన్నారు. మద్యం సేవించడంలో తెలంగాణ మొదట స్థానంలో నిలబెట్టారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో వేల కోట్ల రూపాయల విలువ గల భూములు అమ్మి పాలన చేస్తుందని, ఈ ఏడాది 37వేల కోట్ల రూపాయల మద్యం అమ్మి ఆడబిడ్డల తాలి బోట్లు తెంపేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

పేద ప్రజల గోస నీకు కనబడడం లేదా కేసీఆర్‌ అని ఆయన మండిపడ్డారు. 5500కోట్ల బడ్జెట్ బీసీల కోసం పెడితే ఇంత వరకు ఎంత ఖర్చు చేశారో చెప్పాలని, నీ మాటలకు చేతలకు పొంతన లేదని నిన్ను గద్దె దించేందుకు ప్రజలే కంకణం కట్టుకున్నారన్నారు. ప్రశాంత్ కిషోర్ ఆలోచనలతో ఇక్కడ ఓట్లు రాలవు కేసీఆర్‌.. హుజురాబాద్‌లో కూడా పీకే అనేక సలహాలు ఇచ్చాడన్నారు. హుజూరాబాద్ ఎన్నికల్లో హరీష్ రావు 600కోట్లు ఖర్చు చేశాడన్నారు.

https://ntvtelugu.com/prof-limbadri/
Exit mobile version