ప్రజాసంగ్రామ యాత్ర పేరిట తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గత సంవత్సరం పాదయాత్ర ప్రారంభించారు. అయితే నేటి నుంచి జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి రెండో దశ ప్రజాసంగ్రామ యాత్రను ప్రారంభించనున్నారు. అయితే నేడు డా. బీఆర్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా జోగులాంబ జిల్లాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశానికి దళితుడిని రాష్ట్రపతి చేసిన ఘనత బీజేపీ, మోడీది అని ఆయన కొనియాడారు.
అంబేద్కర్ స్పూర్తితో దళితులకు సంక్షేమ పథకాలను తీసుకొచ్చామని ఆయన అన్నారు. అంతేకాకుండా రాజ్యాంగం తిరిగి రాస్తామన్న వ్యక్తులకు చరమగీతం పాడాలని ఆయన పిలుపునిచ్చారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని మార్చే శక్తి ఎవ్వరికీ లేదని, అంబేద్కర్‌ను ఓడించిన పార్టీ కాంగ్రెస్‌ది ఆయన గుర్తు చేశారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నేటికీ పూర్తి చేయలేదని ఆయన విమర్శించారు. దళిత సీఎం, దళిత బంధు, డబుల్ బెడ్‌రూం ఇండ్లు అని దళితులను మోసం చేశారని ఆయన ఆరోపించారు.