NTV Telugu Site icon

Oil Tanker Overturned: జగిత్యాలలో ఆయిల్ ట్యాంకర్ బోల్తా.. ట్రాన్స్ఫార్మర్ ను ఢీ కొట్టడంతో ప్రమాదం..

Oil Tanker Overturned

Oil Tanker Overturned

Oil Tanker Overturned: జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణ శివారులోని హెచ్ పీ పెట్రోల్ బంకు సమీపంలో జాతీయ రహదారిపై ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. ఆయిల్ ట్యాంకర్ నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో డ్రైవర్‌ బయటకు దూకి ప్రమాదం నుంచి బయటపడ్డాడు. మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అక్కడ విద్యుత్ వైర్లకు మంటలు రావడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇప్పటి వరకు ఎవరూ గాయపడలేదు. పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. సుమారు అరగంట పాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

Read also: Iswarya Menon: టైట్ ఫిట్ డ్రెస్ లో పరువాలు ఆరబోస్తున్న ఐశ్వర్య మీనన్…

అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అరగంట తర్వాత మంటలు అదుపులోకి రావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఘట్కేసర్ నుండి మల్లాపూర్ మండలం రాఘవపేట్ గ్రామ శివారులోని శ్రీ రాజా రాజేశ్వర ఫిల్లింగ్ స్టేషన్ కు HP కంపెనీ యొక్క ఇంధనం ట్యాంకర్ రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. ఇంధనం తరలిస్తున్న ట్యాంకర్ లో 4700 లీటర్ల పెట్రోల్ , 18000 లీటర్ల డీసీల్ ఉందని బంక్ యజమాని తెలిపారు. ఆయిల్ ట్యాంకర్ అదుపు తప్పిన సమయంలో వెంకట్రావ్ పెట్ గ్రామ శివారులోని ట్రన్స్ఫార్మర్ ను ఢీ కొట్టడంతో పట్టణంలో ని పలు వార్డులో దాదాపుగా మూడు గంటలుగా కరెంటు సరఫరాకు అంతరాయం కలిగింది. దీంతో స్థానికులు ఇబ్బంది ఎదుర్కొన్నారు. కానీ.. ఆయిల్ ట్యాంకర్ సమీపంలో పెట్రోల్ బంక్ కూడా ఉండటం ఎటువంటి ప్రమాదాం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
Sunil Gavaskar: ఈ తేడాలు ఎందుకు.. సునీల్‌ గవాస్కర్ ఫైర్!