New Ration Card: తెలంగాణ ప్రజలకు పౌరసరఫరాల శాఖ బ్యాడ్ న్యూస్ చెప్పింది. కొత్త రేషన్ కార్డులు ఇచ్చే యోచన లేదని పౌరసరఫరాల శాఖ ప్రజలకు షాక్ ఇచ్చింది. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదన లేదని అధికారులు వెల్లడించడంతో కొత్త రేషన్ కార్డులు అప్లై చేసిన వారు లబోదిబో మంటున్నారు. తెలంగాణలో కొత్త దరఖాస్తుదారులకు రేషన్ కార్డులు మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని మంత్రి కేటీఆర్, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కూడా వెల్లడించిన సందర్భాలు ఉన్నాయి. దీంతో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ఆశలు చిగురించాయి. అయితే కొత్త రేషన్‌కార్డుల జారీ ప్రక్రియలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని, అయితే కొత్త రేషన్ కార్డులు ఇచ్చే యోచన లేదని పౌరసరఫరాల శాఖ చెబుతోంది. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదన లేదని పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు.
Read also: Bandi Sanjay: మాయ మాటలు చెప్పేందుకే 21 రోజులు కార్యక్రమాలు
కాగా.. ఇప్పుడు కొత్త రేషన్ కార్డుల సమస్య లేదని తెలుస్తోంది. కొత్త రేషన్ కార్డుల కోసం పలువురు దరఖాస్తు చేసుకున్నారు. కానీ వారికి రేషన్ కార్డులు మాత్రం అందలేదు. జూన్ నుంచి జారీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. దీంతో చాలా మంది రేషన్ కార్డు దరఖాస్తుదారులు ఆశలు చిగురించాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదని, ఎన్నికలకు ఆరు నెలల సమయం ఉండడంతో కొత్త రేషన్ కార్డుల ఊసే అందడం లేదని పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే 2018 సంవత్సరంలో ప్రభుత్వం ఎన్నికలకు ముందే రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. దీంతో 9 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక 2021 వరకు అనేక విడతలుగా 3.11 లక్షల మందికి కార్డులు అందజేశారు అధికారులు. కాగా.. అప్పటి నుంచి కొత్త కార్డుల జారీ నిలిచిపోయింది. ప్రస్తుతం రాష్ట్రంలో 90.14 లక్షల ఆహార భద్రత కార్డులున్నాయి.
Read also: Mahesh Kumar Goud: గల్లీ లీడర్ లా బండి సంజయ్ మాటలు.. కార్పొరేటర్ స్థాయి లీడర్లు కూడా బీజేపీ లేరు
జాతీయ ఆహార భద్రత చట్టం కింద 48.86 లక్షల కార్డులు, అంత్యోదయ అన్నయోజన పథకం కింద 5.52 లక్షల కార్డులు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సబ్సిడీతో ఇచ్చిన కార్డులు 35.66 లక్షలున్నాయి. ఇందులో 5,211 కార్డులు అన్నపూర్ణ పథకం కింద ఉన్నాయి. అన్నపూర్ణ పథకం కింద కార్డుదారులకు 10 కిలోల బియ్యం ఉచితంగా అందజేస్తున్నారు. అలాగే ఇతర రేషన్ కార్డులు ఉన్న వారికి ప్రతినెలా రూ. 6 కిలోల బియ్యాన్ని అందిస్తున్నారు. మరి కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం స్పందించక పోవడంతోనే జారీ చేయలేక పోతున్నట్లు పౌరసరఫరాల శాఖ క్లారిటీ ఇచ్చింది. మరి కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసిన వారి పరిస్థితి మాత్రం అగమ్య గోచరంగా మారింది. కొత్త రేషన్ కార్డులు వస్తాయన్న ఆశతో వున్న ప్రజలకు నిరాశేమిగిలేట్లు ఉందని తెలుస్తోంది. అయితే కొత్తగా రేషన్ కార్డులను జారీ చేయాలని.. అప్లై చేసిన వారందరూ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరి దీనిపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
Justice for VOA: కలెక్టరేట్ ముందు విఓఏల ఆందోళన.. సమస్యలను పరిష్కరించాలని నిరసన