NTV Telugu Site icon

Komaram Bheem: పులి దాడిలో పశువులు చనిపోతే రూ.5 వేలు.. అటవీశాఖ అధికారులు ప్రకటన

Korambheem Asifabadd

Korambheem Asifabadd

Komaram Bheem: కొమరం భీం ఆసిఫాబాద్ లో పులుల మరణాలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. రెండు పులులు రెండురోజుల వ్యవధిలో చనిపోవడం పలు అనుమానాలు రేకెత్తించాయి. దీంతో అటవీశాఖ అధికారులు ఏడు బృందాలుగా ఏర్పడి పులుల మృతికి కారకులైన వారిని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. పులుల మృతికి కారుకులైన ముగ్గరుని అటవీశాఖ అధికారులు అదుపులో తీసుకున్నవిషయం తెలిసిందే. ముగ్గురిలో మైనర్ బాలుడు ఉండటం గమనార్హం. అయితే పులులను చంపింది ఆవులపై దాడి చేసి చంపునందుకే అని నిందితులు దర్యాప్తులో వెల్లడించారు. దీంతో అటవీశాఖ అధికారులు అప్రమత్త మయ్యారు. ఆవులపై పులులు దాడి చేసి చంపితే ఆవు యజమానికి రూ.5వేలు ఇస్తామని ప్రకటించారు. దీంతో పులుల మరణాలు అరికట్టవచ్చని భావిస్తున్నారు.

Read also: Stunning Catch: క్రికెట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని క్యాచ్.. వీడియో చూస్తే బిత్తరపోవాల్సిందే!

కాగజ్ నగర్ మండలంలో రెండు పులుల మరణాల తర్వాత అటవీశాఖ అప్రమత్తమైంది. కోసిన, దరిగాం గ్రామాల్లో పులుల రక్షణపై అవగాహన సదస్సులు నిర్వహించారు. పులుల సంచారం , అలాగే పశువులపై దాడి చేస్తే వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. పులి దాడిలో పశువులు చనిపోతే యజమాని బాధపడాల్సిన పనిలేదని.. వారికి తక్షణమే 5 వేలు ఇస్తామని వెల్లడించారు. క్యాటిల్ చనిపోయిన వారం రోజుల్లో మొత్తం డబ్బులిస్తామని అటవీశాఖ అధికారులు వెల్లడించారు. అడవుల్లో ఉచ్చులు, విద్యుత్ వైర్లు విష ప్రయోగం లాంటివి చేయోద్దని హెచ్చరించారు. పులుల సమాచారం కోసం అటవీశాఖ సిబ్బంది నంబర్లను అధికారులు స్థానికులు ఇచ్చారు. సమాచారం కోసం వారు ఇచ్చిన ఫోన్ నెంబర్లకు డయల్ చేయాలని సూచించారు. పులులకు విషం పెట్టి చంపిన వారిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పాంప్ లెట్ లు తయారు చేసి వాటిలో అటవీ అధికారుల నెంబర్లను ఇవ్వడం జరింగిదని వాటికి కాల్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు.
Ponnam Prabhakar: అనాడు రాజీవ్ గాంధీ యే రాముడి చరిత్ర వెలికి తీశారు..