Site icon NTV Telugu

NVSS Prabhakar: వేలకోట్ల పెట్టుబడులు ఏమయ్యాయి?

తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీఆర్‌ఎస్ మాటల యుద్ధం కొనసాగుతూనే వుంది. బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సంచలన కామెంట్లు చేశారు. కేటీఆర్ ఇప్పటికే పలు దేశాలు పర్యటించారు. భారీగా పెట్టుబడులు వస్తాయని చెప్పారు. ఇప్పటి వరకు ఒక్క పెట్టుబడి రాలేదు. సీఎం కేసీఆర్ ప్రత్యేక విమానం వేసుకొని చైనా వెళ్లారు. వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని సీఎం కేసీఆర్ చెప్పారు. ఆ సంగతి ఏమైంది?

వీళ్ళు పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్లడం లేదు. వేరే దేశలో పెట్టుబడులు పెట్టడానికి వెళుతున్నారేమోననే అనుమానం వ్యక్తం చేశారు. వాటిని త్వరలోనే బహిర్గతం చేస్తాం. రానున్న ఎన్నికల కోసం డబ్బులు దండుకోవడానికే 111 జీవోని రద్దు చేస్తున్నారు. మునిసిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ అసమర్థుడు. హైదరాబాద్ ను మురికి కూపంగా మార్చారు.

రాష్ట్రంలో డబల్ ఇంజన్ సర్కార్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు ప్రభాకర్. రాష్ట్ర ప్రభుత్వ సహాయ నిరాకరణ వల్ల కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు వచ్చిన ప్రజలకు లబ్ది చేకూరడం లేదు. కేటీఆర్ విదేశీ పర్యటన పెట్టుబడులు తేవడానికి కాదు అక్రమ సంపాదన సొమ్ముతో పెట్టుబడులు పెట్టడానికి వెళుతున్నారని తీవ్రంగా ఆరోపించారు. కాశ్మీర్ ఫైల్స్ సినిమాకు టాక్స్ ల మినహాయింపు ఇవ్వాలని సీఎం కోరుతున్నా అన్నారు.

https://ntvtelugu.com/fourth-wave-in-india-bharat-biotec-chief-comments/
Exit mobile version